పాలు, పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా నేడు టిఆర్ఎస్ పార్టీ నిరసనలు తెలపనుంది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు.
పాలు మరియు పాల ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి GST పన్ను విధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఆందోళనలు చేపట్టాలని కోరారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు.
రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు మరియు పాల ఉత్పత్తుల పైన పన్ను విధించడం వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ.. అన్ని జిల్లాల్లో నేడు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు కేటీఆర్. ఇందులో రైతులను ముఖ్యంగా పాడి రైతులను భాగస్వాములుగా చేయాలన్నారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు.