‘గుంతలకడి గురునాథం’లో వెన్నెల కిశోర్ లుక్‌ రిలీజ్‌

-

టాలీవుడ్‌లో బ్రహ్మనందం, అలీ లాంటి కమెడియన్ల తరువాత ఆ రేంజ్‌ పేరుతెచ్చుకుంది సునీల్. అయితే సునీల్‌ కాస్త కమెడియన్‌గా కాకుండా హీరోగా ఛాన్సులు రావడంతో ఆ బాటపట్టాడు. అయితే అప్పటికే ఫాంలోకి వస్తున్న వెన్నెల కిషోర్‌కు ఇది అడ్వాంటేజ్‌గా మారింది. అయితే ప్రస్తుత టాలీవుడ్‌లో పాన్ ఇండియా కమెడియన్‌ వెన్నెల కిషోర్‌ క్రేజ్‌ సంపాందించుకున్నారు. సింపుల్ డైలాగ్ డెలివరీతో .. ఎక్స్ ప్రెషన్ తో నవ్వించడం ఆయన ప్రత్యేకత. కమెడియన్ గా సునీల్ తరువాత ఆ స్థాయి స్టార్ డమ్ ఆయనకే దక్కింది.

ఈ మధ్య కాలంలో ఆయనలేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. నితిన్ హీరోగా చేసిన ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాలోను ఆయన ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ సినిమాలో ‘గుంతలకడి గురునాథం’ అనే ఆయన పాత్ర పేరును పరిచయం చేస్తూ పోస్టర్ ను వదిలారు. ‘ఈగో కా బాప్’ అంటూ ఆయనలో ఈగో ఏ రేంజ్ లో ఉండనుందో చెప్పారు. అందుకు తగినట్టుగానే పోస్టర్లో ఆయన ఎక్స్ ప్రెషన్ ఉంది. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాతో రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నితిన్ జోడీగా కృతి శెట్టి సందడి చేయనుంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఆగస్టు 12వ తేదీన విడుదల చేయనున్నారు. చూస్తుంటే వెన్నెల కిశోర్ కామెడీ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news