రైల్వేలో జాబ్ చేయాలనీ అనుకోనేవారికి గుడ్ న్యూస్..రైల్వే అధికారులు ఉద్యోగాల నోటిఫికేషన్ ను విడుదల చేశారు.రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్త్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటి కింద మొత్తం 1659 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు..
అర్హత గల అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్సైట్ rrcpryj.orgని సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 1 ఆగస్టు 2022. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 02 జూలై 2022 నుంచి ప్రారంభం అయింది..అంటే మరి కొద్ది రోజులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది..
ఈ ఉద్యోగాల లో మొత్తం ఖాళీల సంఖ్య 1659 ఉండగా.. ఇందులో ప్రయాగ్‌రాజ్ లో 703, ఝాన్సీలో 660, ఆగ్రాలో 296 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి 10+2 నమూనాలో గుర్తింపు పొందిన సంస్థ నుండి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి..అంతేకాదు అతను/ఆమె NCVT లేదా SCVT, భారత ప్రభుత్వం నుండి సంబంధిత ట్రేడ్‌లో ITI డిప్లొమా కలిగి ఉండాలి. ఈ పోస్టులకు ఎంపిక ఎలా జరుగుతుందంటే.. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
మెట్రిక్యులేషన్ మరియు ఐటీఐ రెండింటి మార్కులకు సమాన వెయిటేజీ ఇవ్వబడుతుంది. దాని ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ.100. రిజర్వేషన్ కేటగిరీ, మహిళా అభ్యర్థులు మరియు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అసలు ఫీజు లేదు..https://www.rrcpryjonline.com/index_act_apprentice_2022_1339.php..ఈ లింక్ ను ఓపెన్ చేసి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు..ఈ నోటిఫికేషన్ కు సంభందించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ https://rrcpryj.org/ తెలుసుకోవచ్చు..