తెలంగాణ మంత్రులు బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారని మంత్రి మేరుగ నాగార్జున కామెంట్స్ చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్ చిత్తశుద్ధితో ఉన్నారు..తెలంగాణ మంత్రుల మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మాకు ముఖ్యం..చంద్రబాబు వరదలు వస్తే బురద రాజకీయాలు చేస్తున్నారు…చంద్రబాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందని పేర్కొన్నారు.
ఏపీలో చంద్రబాబు రథ చక్రాలు ఊడిపోయాయి..పార్టీ పూర్తిగా పాతాళంలో కూరుకు పోయింది..సమర్ధుడైన కొడుకును పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడని ఆయన వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో వరదలు వచ్చి మృతి చెందినా పట్టించుకోలేదు..పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణలో కలపాలా వద్దా సీఎం జగన్ నిర్ణయిస్తారన్నారు. తెలంగాణ మంత్రుల లాగా మేము బ్యాలన్స్ కోల్పోయి మాట్లాడలేము..ఏపీకి భాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రి ఉన్నారని తెలిపారు.