డైరెక్టర్ ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సినీ ప్రేక్షకులు..!!

-

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే సినిమా షూటింగ్ అధికారికంగా మొదలుపెట్టిన రోజునే కొంతమంది దర్శక నిర్మాతలు కూడా విడుదల తేదీని కూడా ప్రకటిస్తూ ఆశ్చర్యాన్ని కలగజేస్తూ ఉంటారు. అయితే ఇలా విడుదల తేదీని కూడా ప్రకటించడం అంటే ఎంతో సాహసంతో కూడుకున్న పని. ముఖ్యంగా వారి ప్లానింగ్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. కానీ ఆర్డర్లో ఎక్కడ మార్పులు చేసుకున్నా కూడా సీన్ మొత్తం మారిపోతుంది . ఇలా ప్రతి సినిమా విషయంలో కూడా సరైన పక్కా ప్లానింగ్ అనేది తప్పనిసరి. ఇకపోతే దర్శకనిర్మాతలు తయారు చేసి పెట్టుకున్న ప్లానింగ్ కి కూడా హీరో హీరోయిన్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా సహకరించాలి. అప్పుడే దర్శకనిర్మాతలు అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయడానికి వీలు ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా సినీ ఇండస్ట్రీలో ఇలా జరగడం అసాధ్యమనే చెప్పాలి. ఇక ఈ క్రమం లోనే చాలా సినిమాలు కూడా రిలీజ్ తేదీలను ముందుగా ప్రకటించడం లేదు. ఇకపోతే ఇటీవల కాలంలో కూడా చాలా సినిమాలు రిలీజ్ తేదీలు ప్రకటించి చివరి నిమిషంలో వాయిదా పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అలాంటి సినిమాలలో హిట్2 సినిమా కూడా ఒకటి. ఇక తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కూడా దర్శకనిర్మాతలు మార్చినట్లు సమాచారం. ఇక విడుదల తేదీని వాయిదా వేయడానికి గల కారణం కూడా మేజర్ సినిమా షూటింగ్ ప్లానింగ్ ప్రకారం జరగకపోవడం వల్ల హిట్ 2 సినిమాను సరైన సమయానికి విడుదల చేయలేకపోయామని దర్శక నిర్మాతలు తెలిపారు.

జూలై 29వ తేదీన ఈ సినిమాని విడుదల చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఆగస్టు చివరి వారంలో రిలీజ్ చేయాలని ప్రకటించారు. మరోపక్క రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా జూలై 29వ తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో ఆగస్టు చివరి వారం అయితే బెటర్ అనుకున్నట్లు ఉన్నారు నిర్మాతలు. ఇక ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ నటిస్తున్న ఏజెంట్ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఆగస్టు 12వ తేదీన రిలీజ్ చేయాలని ఎంతో నమ్మకంతో తేదీని కూడా ముందే చెప్పేశారు. కానీ షూటింగ్ డిలే అవడంతో ఈ సినిమా వాయిదా పడింది. ఇక అంతేకాదు సమంత నటిస్తున్న యశోద, రావణాసుర , కార్తికేయ టు, స్వాతిముత్యం ఇలా అన్ని సినిమాలు కూడా చెప్పిన తేదీకి రిలీజ్ కావడం లేదు .దీంతో సినీ ప్రేక్షకులు కూడా డైరెక్టర్ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news