గేస్‌తోనే అధికంగా మంకీపాక్స్ కేసుల వ్యాప్తి.. సెక్స్ లో పాల్గొనడం వల్లే!

-

కరోనా తర్వాత మంకీపాక్స్ కేసులు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. డబ్ల్యూహెచ్ఓ కూడా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ మంకీపాక్స్ వైరస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గే సెక్స్ వల్లే మంకీపాక్స్ కేసుల వ్యాప్తి అధికమవుతోందని ఆమె తెలిపారు. అధిక జనాభా ఉన్న దేశాల్లో ఈ ముప్పు పొంచి ఉందన్నారు. గే సెక్స్ కు పాల్పడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సాధ్యమైనంతవరకు చర్యలు చేపడుతున్నామన్నారు.

గేస్ సెక్స్-మంకీపాక్స్
గేస్ సెక్స్-మంకీపాక్స్

ఈ సందర్భంగా డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ మాట్లాడుతూ.. మంకీపాక్స్ వైరస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో 16 వేల కేసులు నమోదవుతున్నాయి. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి వేగంగా ఉందన్నారు. గతంలో కంటే ప్రస్తుతం 75 దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందిందన్నారు. అయితే ఈ వైరస్ గే సెక్స్ వల్లే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. గే సెక్స్ వల్ల జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో వ్యాప్తి వేగంగా ఉందన్నారు. మంకీపాక్స్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచదేశాలు ఏకం అవ్వాలి. దేశాలు మంకీపాక్స్ ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించాలన్నారు. కేసులు తక్కువగా ఉన్నప్పుడే వైరస్‌ను ఈజీగా కంట్రోల్ చేయగలమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news