తెలంగాణలో కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ.. టీఆర్ఎస్ లోకి తాండూరు ఎమ్మెల్యే?

-

ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ బాట పట్టగా.. తాజాగా తాండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నాడట.

ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయిన పార్టీ. ఆ పార్టీ త్వరలో భూస్థాపితం కాబోతున్నదని మొన్నటి పరిషత్ ఎన్నికల్లోనే తేటతెల్లం అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ కు ఉన్నదే సింగిల్ డిజిట్ ఎమ్మెల్యేలు. వాళ్లు కూడా రేపో మాపో… కాంగ్రెస్ ను వీడటానికి సిద్ధంగా ఉన్నారు. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల దగ్గర్నుంచి.. మొన్న జరిగిన పరిషత్ ఎన్నికల వరకు ఏ ఎన్నిక చూసినా గెలుపు మాత్రం ఏకపక్షమే. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు లోతున బొంద పెట్టారు. దీంతో అక్కడో ఇక్కడో ఉన్న కాంగ్రెస్ నేతలు ముందే సర్దేసుకుంటున్నారు.

ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ బాట పట్టగా.. తాజాగా తాండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నాడట. దాని కోసం రంగం కూడా సిద్ధం చేసుకున్నాడట. దానిలో భాగంగానే ఇవాళ ప్రగతి భవన్ లో ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. దీంతో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయం అయిపోయినట్టే అని తెలుస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో… 11 మంది ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరగా… రోహిత్ రెడ్డి కూడా చేరితే ఆ సంఖ్య 12 కు చేరుకుటుంది. నల్గొండ ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 6 కు చేరుకుంది. 6 లోనూ మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ ను వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news