వారెవ్వా.. ఏం స్టంట్.. ఊపిరి బిగ‌ప‌ట్టుకొని ఈ వీడియో చూడండి..!

-

అమెరికాస్ గాట్ టాలెంట్ షో దాకా వెళ్ల‌డ‌మే గ్రేట్‌. ఆ షోలో అడుగు పెట్టారంటే వాళ్లు స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌. ఇప్పుడు మ‌నం చూడ‌బోయే వీడియో స‌మ్‌థింగ్ కంటే ఎక్కువ స్పెష‌ల్‌. వాళ్ల స్టంట్ చివ‌ర‌కు షో జ‌డ్జిల‌ను కూడా ఫిదా చేసేసింది.

గత కొన్ని రోజుల కింద ముంబైకి చెందిన వీ అన్‌బీటబుల్ డ్యాన్స్ గ్రూప్ అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో వేసిన డ్యాన్స్‌కు షో జడ్జిలు ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే కదాం. ఆ వీడియోను అమెరికాస్ గాట్ టాలెంట్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.

తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెటిజన్లు అయితే ఆ వీడియోను ఊపిరి బిగపట్టుకొని మరీ చూస్తున్నారు. ఆ స్టంట్‌ను చూడాలంటేనే బెదిరిపోతున్నారు నెటిజన్లు. చివరకు అమెరికాస్ గాట్ టాలెంట్ షో జడ్జిలు, ఆడియెన్స్ కూడా ఊపిరి బిగపట్టుకొని మరీ ఆ స్టంట్‌ను వీక్షించారు.

పంజాబ్‌కు చెందిన జగ్‌దీప్ సింగ్, కవాల్జిత్ సింగ్ ఇద్దరు కలిసి ఆ స్టంట్ చేశారు. ఒకరు కళ్లకు గంతలు కట్టుకుంటే మరొకరిని పడుకోబెట్టి.. వారి చుట్టూ పుచ్చకాయలు, కొబ్బరి కాయలను పేర్చారు. కళ్లకు గంతలు కట్టుకున్న వ్యక్తి.. పడుకున్న వ్యక్తి చుట్టూ ఉన్న కొబ్బరి కాయలు, పుచ్చకాయలను పేద్ద సుత్తితో ఫటా ఫటా కొట్టాలి. పడుకున్న వ్యక్తికి సుత్తి తగలకుండా పగులగొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు కవాల్జిత్ సింగ్. మీరు కూడా వాళ్ల స్టంట్‌ను ఊపిరి బిగపట్టుకొని చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news