కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను అందిస్తుంది.ఇటీవల జీతాల పెంపు పై కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.కేంద్ర ప్రభుత్వం త్వరలో కేంద్ర ఉద్యోగులకు పదోన్నతులు కల్పించనుంది.జూలై 1, 2022న 8,000 మందికి పైగా కేంద్ర అధికారులకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం.. ఇప్పుడు మరోసారి పలువురు అధికారులకు పదోన్నతి కల్పించేందుకు సిద్ధమవుతోంది.
మరో రెండు మూడు వారాల్లో పదోన్నతుల ప్రకటన వెలువడుతుందని అధికారుల ప్రతినిధి బృందంతో భేటీ అనంతరం కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. PIB చేసిన ట్వీట్‌లో ప్రమోషన్‌పై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని.. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ఆసక్తిని కనబరిచారని కేంద్ర మంత్రి ప్రతినిధి బృందానికి చెప్పారని పేర్కొన్నారు.
ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలలో పరిపాలనాపరమైన పనులు చేస్తున్న అధికారులు చివరిగా 2019లో పదోన్నతి పొందారు. ఆ సమయంలో 4,000 మంది అధికారులు మూడు సర్వీసుల్లో పదోన్నతి పొందారు. ప్రభుత్వోద్యోగులు పదోన్నతి లేకుండా సర్వీసు నుంచి రిటైర్ కావడం నిరాశ కలిగించిందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.8,089 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంలో ఉన్న న్యాయపరమైన అడ్డంకులన్నింటినీ పరిష్కరించినందున ఇక నుంచి అన్ని భవిష్యత్ పదోన్నతులను క్రమబద్ధీకరిస్తామన్నారు.
సెంట్రల్ సెక్రటేరియట్ రాజ్‌భాషా సేవా గ్రూప్-ఎ అధికారుల ప్రతినిధి బృందం కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌ను కలిసి ఆయనకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో వారి పదోన్నతుల పనులను కూడా వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ మేరకు కొందరు అధికారులకు పదోన్నతులు కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.జూలై 1, 2022న మూడు సెంట్రల్ సెక్రటేరియట్ క్యాడర్‌లలోని 8,089 మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ అనేది అడ్మినిస్ట్రేటివ్ సివిల్ సర్వీసెస్‌లో ఒకటి, గ్రూప్ A మరియు గ్రూప్ B పోస్ట్‌లలో ఉద్యోగులు పనిచేస్తున్నారు.వారికి పదోన్నతులు త్వరలోనే రానున్నాయి..