మన దేశంలో ఎన్నో ప్రముఖ దేవలయాలు ఉన్నాయి..అందులో కొన్ని దేవాలయాలలో ప్రత్యేకతలు ఉన్నాయి..అలాంటి దేవలయాలలో ఒకటి తిరునెల్వేలిలో ఉన్న నెల్లయ్యప్పర్ ఆలయం.తమిళనాడులో ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.కొన్ని శతాబ్ధాలుగా చెక్కు చెదరని రీతిలో ఉన్న ఆలయాలను మీరు ఇక్కడ చూడవచ్చు. గొప్ప పురాణ ప్రాముఖ్యత కలిగిన ఎన్నో దేవాలయాల్లో తిరునెల్వేలిలో ఉన్న నెల్లయ్యప్పర్ ఆలయం ఒకటి. ఈ ఆలయ ప్రత్యేకత భక్తులను ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. ఇది అందమైన నిర్మాణ కళకు, సంగీత స్తంభాలకు ప్రసిద్ధి చెందింది. అవును మీరు చదివించే నిజమే. ఈ ఆలయంలో సంగీత స్తంభాలు ఉన్నాయి. ఇవి ఒక సంగీత పరికరం మాదిరి శ్రావ్యమైన ధ్వనులను విడుదల చేస్తాయి. నిజంగా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కదా..ఆ గుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పరమ శివుడు తన నృత్యాలను ప్రదర్శించినట్లు చెప్పబడే ఐదు ప్రదేశాలలో తిరునెల్వేలి పట్టణం ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడి నెల్లయ్యప్పర్ ఆలయం క్రీస్తు శకం 700లో పూర్తయ్యింది. వాస్తు శిల్పం పరంగా అత్యుత్తమ కట్టడంగా దీనిని అభివర్ణిస్తారు. సుమారు 14.5 ఎకరాల విస్తీర్ణంలో పాండవులచే ఈ ఆలయ సముదాయం నిర్మించబడిందని చెబుతారు. ఈ ఆలయంలో మీరు చూసే సంగీత స్తంభాలు క్రీస్తు శకం 7వ శతాబ్ధానికి చెందిన పాలకుడు నింద్రసీర్ నేదుమారన్ నిర్మించారు. ఈ స్తంభాలపై చేతులతో తట్టినప్పుడు అవి సంగీత ధ్వనులను వినిపిస్తాయి. ఆ కాలంలో ఇంతగా ఆలోచించి నిర్మించడం గ్రేట్..
ప్రజలు ఈ సంగీత స్తంభాలను చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇవి బెల్ వంటి ధ్వనిని మరియు సంగీత గమనికలను ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ ఉన్న స్తంభాలు వాస్తవానికి ఏడు ప్రాథమిక సంగీత గమనికలను ఉత్పత్తి చేయగలవని చెబుతారు. ఒకే రాయి నుండి చెక్కిన 48 స్తంభాల సమూహం ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇవి కేంద్ర స్తంభం చుట్టూ ఉంటాయి. వీటిని ఎంతో ఉత్తమమైన వాస్తుశిల్ప ప్రమాణాలతో చెక్కారు. ఆలయంలో మొత్తం 161 సంగీత శబ్ధాలు చేసే స్తంభాలు ఉన్నాయి..ఒక స్తంబాన్ని కదిలిస్తె అన్నీ స్తంబాలు కంపిస్తాయి.
ఆ రాతి స్తంబాలలో మూడు వర్గీకరణలు ఉంటాయి. అవి ఒకటి శృతి స్తంభం, రెండు గణ తూంగల్, మూడు లయ తూంగల్ నెల్లయ్యప్పర్ ఆలయంలో మీరు శృతి మరియు లయ కలయికను కనుగొంటారు. శృతి ప్రాధమిక గమనికలు అయితే లయ స్తంభాలు స్పందనలను ఉత్పత్తి చేస్తాయి. వీటినే తాళం అని పిలుస్తారు…ఆనాటి ప్రాచీన కళకు ఇవి చిహ్నంగా నిలిచాయి..ఎప్పుడైనా తమిళనాడు వెళితే ఆ దేవాలయాన్ని తప్పక చూడండి..