భీష్ముడు అంటే తెలియని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. తరచూ పెద్దలను, ఆయా రంగాలలో అపార అనుభవాన్ని గడించిన వారిని చూసి ఆయన భీష్మ పితాహహుడు అంటుంటారు. అంటే ఆయా విద్యలు లేదా పనుల్లో మహా నిపుణుడు/పారంగతుడు అని అర్థం. భీష్ముడు ఎవరు, ఎక్కడ విద్యను అభ్యసించాడో తెలుసుకుందాం…
భీష్ముడు గంగా, శంతనులు అష్టమ పుత్రుడు. ఆయన దృఢవత్ర శీలుడు. ఆ జన్మాంతం బ్రహ్మచారీగా ఉంటాడు. ఆయన సకల ధర్మాలను చ్యవన, మార్కండేయుల వద్ద నేర్చుకున్నాడు. భీష్ముడు భూతభవిష్యద్వర్తమానవేది. సర్వవిద్యలకు ఆధారభూతుడు. ధర్మరాజుకు ధర్మాలను ఉపదేశించిన మహా బుద్ధిశాలి. ఒకానొక సందర్భంలో గురువు దోషదూషితుడైనప్పుడు ఆ దోషాన్ని గుర్తుకు తెచ్చి అతనికి కనువిప్పు కలిగిండచం శిష్యుని ధర్మం.
శిఖండిని ఉద్దరించడానికి పోటీపడిని తన గురువైన పరుశరామునికి ధర్మతత్తాన్ని వివరించి గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నాడు. భీష్ముడు వల్ల పరుశరామునికి కీర్తి కలిగింది. ఇప్పుడు అర్థమయ్యిందా.. భీష్ముడు గురువులు ఎవరెవరు అనేది… చ్యవనుడు, మార్కండేయుడు, పరుశరాముడు. అదండి సంగతి. కురువృద్ధ పితామహుడు.. మహాబలశాలి, ఆ జన్మ బ్రహ్మచారి, ధర్మోపదేశ విజ్ఞాని భీష్మ పితామహుడు.