జూన్ 9 ఆదివారం రాశిఫలాలు.. పెట్టుబడుల‌కు అనుకూలం

441

మేషరాశి : పనిచేసే చోట అనుకూలత, సేవింగ్స్‌కు అవకాశం, స్నేహితుల సలహాలు పాటించండి, చిరునవ్వు మీ సమస్యలకు పరిష్కారం, జీవతభాగస్వామితో ఆనందం, ఆరోగ్యం బాగుంటుంది. పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దైవనామస్మరణ చేసుకోండి.

వృషభరాశి : ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, కుటుంబ సంతోషం, ప్రయాణ సూచన, అనుకోని శుభవార్తా శ్రవణం, సంతోషభరితమైన క్షణాలు, భాగస్వామితో అనుకూల వాతావరణం, సానుకూల ఆలోచనలు చేస్తే ఫలితాలు అలానే వస్తాయి.
పరిహారాలు: ఎరుపు కాయధాన్యాలను దేవునికి ప్రసాదంగా పెట్టి స్వీకరించండి మంచి ఫలితాలు వస్తాయి.

మిథునరాశి : తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి, పిల్లలతో ఎక్కువ సమయం గడపండి, వస్తువులు జాగ్రత్త, భాగస్వామితో సంతోషం, ప్రయాణాలు వాయిదా, పనులు పూర్తి.
పరిహారాలు: ఆర్థిక పరిస్థితి మెరుగు కావడానికి సుగంధ, కర్పూర వంటివాటిని దానం చేయండి.

కర్కాటకరాశి : ఆరోగ్యం జాగ్రత్త, ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి, దీర్ఘకాలిక ముదుపులతో లాభాలను పొందుతారు, స్నేహితుల కలయిక సంతోషాన్ని కలిగిస్తుంది, భాగస్వామితో మనస్పర్థలు, శుభకార్య నిర్వహణకు అవకాశం. ప్రయాణాలు అనుకూలం.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర గోధుమలను నైవేద్యంగా సమర్పించండి ఆరోగ్యం మెరుగువుతుంది. (న‌వ‌గ్ర‌హాల పూజ‌)

సింహరాశి : ఆర్థికంగా బాగుంటుంది, ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, కుటుంబంలో సమస్యలు, ఆరోగ్యం బాగుంటుంది, చర్యకు ప్రతిచర్య గురించి ఆలోచించకండి, వివాదాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
పరిహారాలు: ఓం క్రాం క్రీం క్రౌం సః భౌమాయనమః అనే మంత్రాన్ని 11 సార్లు ఉదయాన పఠించండి, శాంతియుతమైన ఆనందమైన జీవితానికి దోహదపడుతుంది. స్నానం చేసి శుభ్రవస్ర్తాలను ధరించిన తర్వాత.

కన్యారాశి : విభేధాలను మానితే ఆరోగ్యం కలుగుతుంది, కుటుంబంలో ఆనందం, చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ బిల్లులు చేతికిందుతాయి, కొత్త ప్రదేశాల సందర్శన, భాగస్వామితో స్వల్ప మనస్పర్థలు.
పరిహారాలు: శనగలు, నల్లని దుస్తులు లేదా వస్త్రం దానం చేయండి మంచి ఆరోగ్యాన్ని పొందండి.

తులారాశి : ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సంతోషం, వృత్తిలో అనుకూలత, భవిష్యత్ గమ్యాల గురించి గోప్యత పాటించండి, పిల్లల విజయాలు మీకు ఆనందాన్ని గౌరవాన్ని పెంచుతాయి, పనులు సానుకూలం.
పరిహారాలు: ఆర్థిక ఇబ్బందులు పోవడానికి భైరవుడిని ఆరాధించండి.

వృశ్చికరాశి : ఆరోగ్య రక్షణ, శక్తి దూరప్రయాణాలు చేయడానికి అనుకూలం, అలసటను జయిస్తారు, లాభాలు, విహారయాత్రలు, భాగస్వామితో ఇబ్బందులు, అనవసర మాటలు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణలు, గోధుమలను నైవేద్యం పెట్టండి మంచి జరుగుతుంది.

ధనస్సురాశి : సొమ్మును సురక్షితమైన చోట పెట్టండి, దయా, ప్రేమతో మెలగండి, కుటుంబంతో ఎక్కువ సమయం గడపాల్సిన సమయం, ప్రేమికులకు అనుకూలం, ఆర్థికంగా పర్వాలేదు, వృత్తిలో జాగ్రత్త. ప్రయాణాలు వాయిదా వేసుకోండి.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణలు, శనిస్తోత్రం చదవడం వల్ల మనఃశాంతి లభిస్తుంది.

READ ALSO  ఈరాశివారు ఈరోజుచేసే పనితో భవిష్యత్‌లో మంచి లాభాలు!-ఆగస్టు 26 - సోమవారం

మకరరాశి : ఆనారోగ్య సూచన, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో సంతోషం, ప్రేమ విషయాలు అనకూలం, భాగస్వామితో ఆనందం, పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాల్సిన రోజు, వినోదయాత్రలు, పనుల్లో జాప్యం.
పరిహారాలు: ఆరోగ్యం కోసం నవగ్రహాల దగ్గర గోధుమలను నైవేద్యంగా సమర్పించండి.

కుంభరాశి : రియల్ ఎస్టేట్ పెట్టుబడులు అనుకూలం, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి, కుటుంబంలో ఆనందం, శుభకార్య సూచన, వృత్తిలో ఇబ్బందులు, ఆర్థికంగా బాగుంటుంది, సోమరితనాన్ని వీడాల్సిన రోజు.
పరిహారాలు: శివుని ఆరాధన వల్ల మీకు మంచి జరుగుంది.

మీనరాశి : ఆరోగ్యం బాగుంటుంది, బీజీగా ఉంటారు, బంధువులను కలుస్తారు, భాగస్వామితో అనుకూల వాతావరణం, ఆర్థికంగా పర్వాలేదు, పనులు పూర్తి, ప్రయాణ సూచన, ఆకస్మిక ఘటనలు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

– కేశవ