SI Exam : ఎస్సై పరీక్షకు నేటి నుంచి హాల్​టికెట్లు

-

పోలీస్‌ నియామకాలకు సంబంధించి అభ్యర్థుల హాల్​టికెట్లు ఇవాళ్టి నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులు హాల్‌టికెట్లను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌ www.tslprb.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 5న రాత్రి 12 గంటల వరకు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. హాల్‌టికెట్లను ఏ4 సైజ్‌ లోనే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.


పరీక్ష నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని మరో పేజీలో కాకుండా అదే కాగితంపై వెనకవైపు ప్రింటవుట్‌ తీసుకోవాలి. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో సరిపోతుంది. డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌లోని నిర్దేశిత స్థలంలో అభ్యర్థి ఫొటోను అతికించుకోవాలి. దరఖాస్తు చేసిన సమయంలో డిజిటల్‌ కాపీలో ఉంచినటువంటి ఫొటోనే తిరిగి వినియోగించాలి.

ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్‌లు కొట్టొద్దు. ఫొటో లేకుంటే పరీక్షకు అనుమతించరు. ఒకవేళ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో ఏవైనా సమస్యలుంటే 93937 11110 లేదా 93910 05006 నంబర్లకు కాల్‌చేసి నివృత్తి చేసుకోవచ్చు. లేదా [email protected] కు మెయిల్‌ పంపి సహాయం పొందొచ్చు.

ఎస్సై పరీక్షకు ఈసారి బయోమెట్రిక్ విధానం అమల్లో ఉండటంతో గంట ముందే కేంద్రంలోనికి అభ్యర్థులను అనుమతించనున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక నిమిషమైనా అనుమతించరు.

Read more RELATED
Recommended to you

Latest news