‘టైగర్ నాగేశ్వరరావు’ షూటింగ్‌లో జాయిన్ అయిన కశ్మీర్ ఫైల్స్ నటుడు..

-

టాలీవుడ్ హీరో, మాస్ మహారాజ్ రవితేజ… క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. క్రాక్ లాంటి భారీ హిట్ తర్వాత రవితేజ అ వరుసగా ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే రవితేజ చేసిన ఖిలాబీ, రామారావు ఆన్‌ డ్యూటీ సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం షూటింగ్‌ దశ లో ధమాకా సినిమా ఉంది.

ఈ నేపథ్యం లోనే రవితేజ కెరీర్‌ లో 70 వ సినిమా కు రవి తేజ సైన్ చేశాడు. ఈ సినిమాకు “టైగర్ నాగేశ్వరరావు” అనే టైటిల్ ను ఇప్పటికే ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాకు అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా… వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే తాజాగా ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ లో జాతీయ నటుడు ది కశ్మీర్‌ ఫైల్స్‌ ఫేమ్‌ అనుపమ్‌ ఖేర్‌ జాయిన్‌ అయ్యారు. ఆయన తాజాగా ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలో తన నటనతో ఇప్పటికే ఆకట్టుకున్నారు. ఈనేపథ్యంలోనే “టైగర్ నాగేశ్వరరావు” లో చేస్తున్నారు అనుపమ్‌ ఖేర్‌. ఈ మేరకు ఆయన పిక్‌ ను రివీల్‌ చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news