జగన్ సర్కార్ కు ఏపీ ఉద్యోగులు వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగుల ఆర్ధికపరమైన అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వటం లేదని ఆగ్రహించారు ఏపీ జేఏసీ అమరావతి ప్రతినిధులు బొప్పరాజు. ఉద్యోగుల దాచుకున్న రూ. 3 వేల కోట్ల జీపీఎఫ్ సొమ్మును తిరిగి పొందటం కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని.. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రూ. 7 వేల కోట్ల డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
పీఆర్సీ అరియర్ సొమ్ముపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదని ఆగ్రహించారు. కొత్త జిల్లాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు 16 శాతం హెచ్ఆర్ఏ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని.. కొత్త జిల్లాల్లో ఆర్డర్ టు సర్వ్ కింద కేటాయించిన ఉద్యోగులకు తీవ్రమైన పని ఒత్తిడి పెరుగుతోందని వెల్లడించారు ఏపీ జేఏసీ అమరావతి ప్రతినిధులు బొప్పరాజు.