పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు : ఈటల రాజేందర్‌

-

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ప్రారంభించిన మూడో దశ ప్రజా సంగ్రామ యాత్ర ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే నేడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పాదయాత్రలో ఉన్న బండి సంజయ్‌ జనగామ జిల్లాలోని దేవరుప్పల పాఠశాలల్లో నిర్వహిస్తున్న స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉద్రికత్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీ నేతలపై రాళ్లదాడి చేశారు. అయితే ఈఘటనపై తాజాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ కార్యకర్తలు గుండాల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న బండి సంజయ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండించారు ఈటల రాజేందర్‌.

Etela Rajender: TRS made a hundred mistakes as a baby – NTV – 2Telugustates

రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఈటల రాజేందర్‌. బండి సంజయ్ పై జరిగిన దాడిని చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు ఈటల రాజేందర్‌. ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఇలాంటి నీచమైన సంస్కృతిని రాజకీయాలకు  అంటిస్తే.. టీఆర్ఎస్ అందులోనే మాడి మసై పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్‌. టీఆర్ఎస్ పై రోజురోజుకు ప్రజల్లో విశ్వాసం తగ్గుతోందన్న ఆయన… అందుకే టీఆర్ఎస్ నేతలు అసహనానికి గురవుతున్నారని చెప్పారు ఈటల రాజేందర్‌. చట్టపరంగా వ్యవహరించాల్సిన పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు ఈటల రాజేందర్‌.

 

 

Read more RELATED
Recommended to you

Latest news