ఇవాళ అబిడ్స్ ఏరియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన

-

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ఇవాళ కీలక ఘట్టంజరుగనుంది. ఇవాళ ఉదయం 11.30 కి సామూహిక జాతీయ గీతం ఆలాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి జాతీయ గీతం ఆలాపన చేయనున్నారన్న మాట.

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, స్థానిక మున్సిపల్ వార్డులు, ముఖ్యమైన ప్రధాన జంక్షన్లు, ట్రాఫిక్ జంక్షన్లు, పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జైళ్లు, కార్యాలయాలు, మార్కెట్ స్థలాల్లో గీతం ఆలాపన చేయనున్నారు. హైదరాబాద్‌ అబిడ్స్‌లోని జనరల్‌ పోస్ట్‌ ఆఫీస్‌ (జీపీవో) సర్కిల్‌ వద్ద నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొననున్నారు.

మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఇందులో భాగస్వాములవనున్నారు.11.30కి ‘జనగణమన’ జాతీయ గీతాన్ని ఆలపించాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే పిలుపునిచ్చారు. దీని కోసం ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసింది. పోలీసు శాఖకు పర్యవేక్షణ బాధ్యతను అప్పగించింది. అయితే ఈ కార్యక్రమం నేపథ్యంలో ఇవాళ ఐదు నిమిషాల పాటు నిలిచిపోనుంది ట్రాఫిక్.

Read more RELATED
Recommended to you

Latest news