బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు హైదరాబాద్‌ వాసులు దుర్మరణం

-

కర్ణాటకలోని కలబురిగి జిల్లా గాన్గాపూర్‌లో దత్తాత్రేయ స్వామి దర్శనానికి వెళ్తున్నఓ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారి కూడా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న ఆ రాష్ట్ర పోలీసులు మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్‌ సైబర్‌ క్రైం విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న గిరిధర్‌.. తన 10 మంది కుటుంబసభ్యులతో కలిసి కర్ణాటకలోని కలబురిగి జిల్లా గాన్గాపూర్‌లో దత్తాత్రేయ స్వామి దర్శనానికి కారులో వెళ్తున్నారు. బీదర్‌ జిల్లాలోని బంగూరు వద్దకు రాగానే అదుపుతప్పిన కారు కంటైనర్‌ను వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారిలో చిన్నారి సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మరో వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతులు గిరిధర్ (45), ప్రియ (15), అనిత (30), మహేశ్‌ (2), డ్రైవర్‌ జగదీశ్‌ (35)గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని బీదర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీదర్ తాలూకా మన్నల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news