IND vs Pak : భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లలో భారీ స్కామ్ !

-

ఆసియా కప్ లో భాగంగా జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు పక్కదారి పట్టాయి. సోమవారం టికెట్లను అందుబాటులో ఉంచిన ఆరున్నర నిమిషాల్లోనే మొత్తం హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో టికెట్లు లభించక చాలామంది నిరాశకు గురయ్యారు. స్వాతంత్ర దినోత్సవం రోజు అమ్మకాలు ఉంటాయని నిర్వాహకులు ముందుగానే ప్రకటించడంతో, టికెట్ల కోసం అభిమానులు పోటీపడ్డారు. సుమారు 75000 మంది టికెట్ల కోసం ఒకేసారి లాగిన్ అవ్వడంతో అధికారిక వెబ్ సైట్ క్రాష్ అయ్యింది.

రద్దీని నియంత్రించేందుకు నిర్వాహకులు సైట్ లో క్యూ సిస్టం ను తీసుకొచ్చారు. దీంతో మధ్యాహ్నం 12 గంటల వరకే ఏడున్నర లక్షల మంది బుకింగ్ చేసుకున్నారు. అయితే టికెట్లు తక్కువగా ఉండటంతో రాత్రి అమ్మకాలు మొదలుపెట్టిన నిమిషాల్లోనే మొత్తం అయిపోయాయి.

అయితే దాయాదుల కొరకు ఉన్న భారీ డిమాండ్, అభిమానుల్లో ఉన్న క్రేజ్ ను సొమ్ము చేసుకుంటూ అక్రమార్కులు బ్లాక్ దందాకు తెరలేపారు. ఒక్కో టికెట్ ను నాలుగు రేట్లు పెంచి అమ్ముతున్నారు. సుమారు ఒక్కో టికెట్ రూ.15 వేలకు అమ్ముతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. చేసేది లేక బ్లాక్ లో టికెట్ ధరకు నాలుగింతలు ఎక్కువ చెల్లించి తీసుకుందామన్న, టికెట్లు దొరకడం లేదని అభిమానులు వాపోతున్నారు. తాము ఒక్కో టికెట్ కు రూ.30 వేలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎక్కడ అమ్ముతున్నారో చెప్పండంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news