పవన్ కల్యాణ్ కొత్త లుక్.. సినిమా కోసమా.. మళ్లీ మేకప్ వేసుకుంటున్నాడా?

-

తాజాగా పవన్ కొత్త గెటప్ చూస్తే అదే అనిపిస్తుంది. పార్టీని వదిలేసి మళ్లీ సినిమాల మీద పడ్డాడా అన్న డౌట్ వస్తోంది. ఎన్నికల ముందు వరకు గడ్డం పెంచుకొని తెల్లని పంచె, లాల్చీలో దర్శనమిచ్చిన పవన్.. తాజాగా జీన్స్, టీషర్ట్స్‌లోకి కనిపించాడు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరో. అందులో డౌటే లేదు. ఆయన సినిమా ఆయుమన్న ఒక్క సినిమా తీస్తే మిగితా హీరోలంతా కుదేలు అవ్వాల్సిందే. పదుల సంఖ్యలో సినిమాలు ప్లాఫ్ అయినా ఒక్క సినిమాతో టాప్ హీరో స్థానాన్ని సంపాదించాడు పవన్. టాలీవుడ్‌లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు.

కానీ.. రాజకీయాల్లోకి వెళ్లి తన సినిమా ఫేమ్‌నంతా పోగొట్టుకున్నాడు పవన్. పోనీ.. రాజకీయాల్లో నిలదొక్కుకున్నాడా అంటే అదీ లేదు. మొన్నటి ఎన్నికల్లో కేవలం ఒకే ఒక సీటు గెలిచింది జనసేన. దీంతో పవన్ పార్టీ కూడా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలా అవుతుందేమో అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

తాజాగా పవన్ కొత్త గెటప్ చూస్తే అదే అనిపిస్తుంది. పార్టీని వదిలేసి మళ్లీ సినిమాల మీద పడ్డాడా అన్న డౌట్ వస్తోంది. ఎన్నికల ముందు వరకు గడ్డం పెంచుకొని తెల్లని పంచె, లాల్చీలో దర్శనమిచ్చిన పవన్.. తాజాగా జీన్స్, టీషర్ట్స్‌లోకి కనిపించాడు. గెడ్డం కూడా గీకేశాడు. స్టయిలిష్‌గా కనిపిస్తున్నాడు. అంటే.. మళ్లీ మేకప్ వేసుకోబోతున్నాడు పవన్.. సినిమాల్లో నటిస్తాడు.. అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరో ఐదేళ్ల దాకా ఎన్నికల లేకపోవడం.. ఐదేళ్ల దాకా రాజకీయాలతోనే కాలం గడపాలంటే కష్టమే కదా. అందుకే.. అప్పటి వరకు కొన్ని రోజులు సినిమాల్లో నటించి కొన్ని రాళ్లు వెనకేసుకుంటే పోలా.. అని పవన్ అనుకుంటున్నాడేమో.. అందుకే కొన్ని రోజులు జనసేనకు బ్రేక్ ఇచ్చి మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడానికే ఈ గెటప్… అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news