ఇంటర్‌తో 2700 నేవీ ఉద్యోగాలు .. జీతం 21000

-

  • ఇంటర్ అర్హత
  • 2700 ఖాళీలు
  • మంచి జీతభత్యాలు, భద్రమైన కొలువులు

ఇండియన్ నేవీలో ఏఏ, సీనియర్ సెకండరీ రిక్రూట్స్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 2700

విభాగాల వారీగా : ఆర్టిఫైజర్ అప్రెంటిస్ (ఏఏ)-500
– సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్‌ఎస్‌ఆర్)-2200

అర్హతలు: ఇంటర్/10+2 లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్‌లలో ఏదో ఒక సబ్జెక్టు చదివి ఉండాలి.

వయస్సు: 2000 ఫిబ్రవరి 1 నుంచి 2003 జనవరి 31 మధ్య జన్మించి ఉండాలి.

జీతభత్యాలు: శిక్షణ సమయంలో నెలకు రూ. 14,600/- ఇస్తారు. శిక్షణ తర్వాత రూ. 21,700 – 69,100 + ఎంఎస్‌పీ రూ. 5,200/- + ఎక్స్ గ్రూప్ పే రూ. 6200/-+ డీఏ ఇస్తారు.

పదోన్నతులు: సెయిలర్ నుంచి మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ – 1 (సుబేదార్‌కు సమాన స్థాయి) వరకు ఉంటుంది.

ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా
రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ పరీక్షలో ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు.
– ప్రశ్నపత్రం ఇంటర్ స్థాయిలో ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు
– ప్రతి తప్పు సమాధానానికి 0.25 లేదా 1/4 మార్కులను తగ్గిస్తారు. అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లో తప్పనిసరిగా క్వాలిఫై కావాలి.

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ): 7 నిమిషాల్లో 1.6 కి.మీ దూరాన్ని పరుగెత్తాలి. 20 ఉతక్, బైఠక్ (గుంజీలు), 10 పుష్ అప్స్ చేయాలి.

శారీరక ప్రమాణాలు: 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు, ఛాతీ ఉండాలి. గాలి పీల్చిన-ప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి.

అప్లికేషన్ ఫీజు: 205/- (ఎస్సీ/ఎస్టీలకు ఫీజులో మినహాయింపు ఉంటుంది)
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూన్ 28
చివరితేదీ: జూలై 10
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news