రైతులకు గుడ్ న్యూస్.. వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ

-

రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ పునరుద్ధరించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. రూ.3 లక్షల వరకు ఉన్న రుణాలపై 1.5 శాతం చొప్పున రాయితీ ఇవ్వనున్నారు. ఈ రాయితీ మొత్తాన్ని రుణాలు జారీ చేసే ఆర్థిక సంస్థలకు కేంద్రం చెల్లిస్తుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

కేబినెట్‌ తీసుకున్న వడ్డీ రాయితీ నిర్ణయం వల్ల వ్యవసాయ రంగానికి రుణ లభ్యత పెరుగుతుందని కేంద్రం పేర్కొంది. 2022-23 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరాలకు గానూ ఈ స్కీమ్‌ వర్తిస్తుందని తెలిపింది. దీనివల్ల రూ.34,856 కోట్లు కేంద్రంపై భారం పడుతుందని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, స్మాల్‌ఫైనాన్స్‌, రీజినల్‌ రూరల్‌ బ్యాంకులు, కో-ఆపరేటివ్‌, ప్రాథమిక పరపతి సంఘాలకు ఈ వడ్డీ రాయితీ వర్తిస్తుందని కేంద్రం వెల్లడించింది. రైతులు తీసుకొనే స్వల్పకాలిక రుణాలకు ఎప్పటిలానే 4 శాతం వడ్డీ వర్తిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news