కెసిఆర్ సర్కార్ ను మేము కూల్చాల్సిన అవసరం లేదని.. అదే కూలిపోతుందని అన్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. సీఎం కేసీఆర్ కు, ఎమ్మెల్యేలకు మధ్య ఆత్మీయ బంధం లేదని అన్నారు. ఇది అపనమ్మకంతో పరస్పర అవసరాల కోసం కొనసాగుతున్న సర్కారు అని అన్నారు ఈటెల. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఖాళీ అయింది, చతికల పడింది అది లేచే
పరిస్థితి లేదన్నారు.
21వ తారీకున మీటింగ్ పెట్టుకుంటామని.. అమిత్ షా వస్తారని చాలా రోజుల క్రితమే మేం ప్రకటించామని.. కానీ గిల్లి కజ్జాలు పెట్టుకున్నట్లు ఒకరోజు ముందే ముఖ్యమంత్రి సభ ఏర్పాటు చేశారని అన్నారు ఈటెల. 2014 వరకు తెలంగాణ గాంధీ అని పిలవబడ్డ కేసీఆర్.. ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ ద్రోహిగా ఎందుకు పిలవబడుతున్నారో వారే తెలుసుకోవాలని సూచించారు. సొంత పార్టీ ప్రజా ప్రతినిధులను, నాయకులను కొనుక్కోవడం సిగ్గుచేటని అన్నారు. సొంత పార్టీ వారిని పార్టీలో చేరుతున్నట్లు మళ్లీ కండువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు ఈటెల రాజేందర్.