టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబాయిని చంపేశారు.. గొడ్డలి నా చేతిలో పెట్టారని మండిపడ్డారు. వైఎస్ వివేకా హత్య ఉదంతం తరహాలో ఎవ్వరూ సినిమాలు తీయలేరు.. డిక్టెటివ్ నవళ్లు రాయలేరని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తరహాలో అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా..? విదేశీ విద్యా దీవెనకు అంబేద్కర్ పేరు తీసేసి తన పేరు పెట్టుకుంటారా..? అని ఆగ్రహించారు.
దేశంలో ఎవరూ జగన్ తరహాలో అంబేద్కరును అవమానించలేదని… రాష్ట్రంలో తమకు నచ్చని వాళ్లను ఇష్టం వచ్చినట్టు చంపేస్తున్నారని ఆగ్రహించారు. ఏపీలో మనిషి ప్రాణం కోడి కంటే చులకనైపోయిందని.. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం నట్టేట ముంచిందని మండిపడ్డారు.
డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి కారణం వైసీపీ ప్రభుత్వానిదేనని పీపీఏ స్పష్టంగా చెప్పిందని.. డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి కారణం ముందుగా టీడీపీ అన్నారు.. నివేదికలు వచ్చాక.. ఇప్పుడు కేంద్రాన్నే తప్పు పడుతున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. చేతకాని వాడే కులాల గురించి మాట్లాడతారని నా అభిప్రాయమని… అన్ని కులాలు నా కులాలే అన్నారు. అనంతపురంలో కియా పెడితే బడుగులకే ఎక్కువ లబ్ది చేకూరిందని… కుప్పంలో 100 కమ్మ కుటుంబాలు కూడా ఉండవని పేర్కొన్నారు. నాకు ఓట్లేసి గెలిపించింది బడుగులేనని… ఏ కులంలో పేదరికం ఉంటే.. ఆ కులానికే నా ప్రాధాన్యత ఇస్తామనన్నారు.