ఇప్పటివరకు ఓ లెక్క.. ఇప్పటినుంచి ఓ లెక్క.. ‘రంగ రంగ వైభవంగా’ ట్రైలర్ అదుర్స్

-

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్. అయితే తన డెబ్యూ ఫిలిం ఉప్పెన సినిమాతో యూత్ ను ఆకట్టుకున్నాడు .. ఆ తరువాత ‘కొండ పొలం’తో మాస్ ఆడియన్స్ కి చేరువయ్యాడు వైష్ణవ్ తేజ్. ఆయన మూడో సినిమాగా ‘రంగ రంగ వైభవంగా’ రూపొందింది. ఇది ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్లో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు వైష్ణవ్ తేజ్. తమిళంలోకి ‘అర్జున్ రెడ్డి’ని రీమేక్ చేసిన గిరీశాయ ఈ సినిమాకి దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో వైష్ణవ్ జోడీగా కేతిక శర్మ అందాల సందడి చేయనుంది. వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు నాడు ఈ సినిమా రిలీజ్ ను ప్లాన్ చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది.

Ranga Ranga Vaibhavanga trailer – Fun-filled | 123telugu.com

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఫ్యామిలీ నేపథ్యంలో జరిగే ప్రేమకథ ఇది. హీరో హీరోయిన్ ఒకటి కావాలనే అందరూ కోరుకుంటూ ఉంటారు. సహజంగానే వాళ్లిద్దరి మధ్య గిల్లికజ్జాలు నడుస్తుంటాయి. ఆ అలకలు .. బుజ్జగింపుల మధ్య కొంత యాక్షన్ .. కొంత ఎమోషన్ ఉన్నట్టుగా ఈ ట్రైలర్ లో చూపించారు. చూస్తుంటే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలానే కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news