కమలం కొత్త ఫార్ములా..గెలుపుకు దగ్గరగా..!

-

తెలంగాణలో అంచలంచెలుగా ఎదుగుతూ వస్తున్న బీజేపీ…అధికారంలోకి రావడానికి ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలని తెరపైకి తీసుకొస్తుంది..నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి అధికారం దక్కించుకోవడం కోసం బీజేపీ సరికొత్త రాజకీయ సమీకరణాలని తెరపైకి తీసుకొస్తుంది. రాష్ట్రంలో బలపడటానికి ఊహించని వ్యూహాలతో ముందుకొస్తుంది…ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఉన్న బలాన్ని తమ వైపు తిప్పుకుంటుంది. అలాగే టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లని కాంగ్రెస్ వైపుకు వెళ్లకుండా చేయాలనే ప్రయత్నాలు చేస్తుంది.

ఇతర పార్టీల నుంచి నాయకులు వస్తేనే బీజేపీ బలపడుతుందని ఇటీవల వచ్చిన సర్వేల్లో తేలిన విషయం తెలిసిందే…అందుకే కాంగ్రెస్, టీఆర్ఎస్ ల్లో ఉన్న బలమైన నేతలని బీజేపీ లాగేసే ప్రయత్నం  చేస్తుంది…ఇప్పటికే కొందరు నేతలు వచ్చారు…ఇంకా ఎన్నికల నాటికి మరికొందరు నేతలని లాగాలని చూస్తుంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం లాంటి జిల్లాలో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు.

ఇప్పుడు ఆ బలం పెంచుకునే కార్యక్రమాలు చేస్తుంది…నల్గొండలో కీలకమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి తీసుకొచ్చింది. ఇక మునుగోడు ఉపఎన్నికలో గాని బీజేపీ గెలిస్తే…ఇంకా దక్షిణ తెలంగాణలో ఆ పార్టీలోకి చేరికలు పెరుగుతాయి…దీని వల్ల పార్టీ మరింత బలపడుతుంది. మునుగోడు ఉపఎన్నిక తర్వాత బీజేపీ మరింత దూకుడుగా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించని ఫార్ములాలతో బీజేపీ రాజకీయం చేసేలా ఉంది.

ప్రస్తుతం బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం…ఎన్నికల్లో గాని బీజేపీ గెలిస్తే ఒక బీసీ నేతకు గాని, ఎస్సీ నేతకు గాని సీఎం సీటు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ముఖ్యంగా బీసీ నేతనే సీఎం సీటులో కూర్చోబెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఎందుకంటే తెలంగాణలో బీసీలు అధికంగా ఉన్నారు…వారే గెలుపోటములని డిసైడ్ చేయగలరు. కాబట్టి బీసీలని అక్కటుకోవాలంటే బీసీ నేత సీఎం అభ్యర్ధి అనే ఫార్ములాతో బీజేపీ ముందుకెళ్లే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news