కాంగ్రెస్‌కు మరో షాక్‌.. మరో కీలక నేత రాజీనామా

-

దేశంలో కాంగ్రెస్‌ పరిస్థితి రోజు రోజుకు ప్రశ్నార్థకంగా మారుతోంది. అయితే.. తాజాగా మరో కీలక నేత కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తూ బిగ్‌ షాక్‌ ఇచ్చారు. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ కేంద్రంగా రాజ‌కీయం నెర‌పుతున్న పార్టీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు మ‌హ్మ‌ద్ అలీ ఖాన్ (ఎంఏ ఖాన్‌) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీకి పంపారు. హైద‌రాబాద్ రాజ‌కీయాల్లో కాంగ్రెస్ పేరు చెబితే… ఏంఏ ఖాన్ ప్ర‌స్తావ‌న లేకుండా చ‌ర్చ ముగియ‌ని ప‌రిస్థితి. ముస్లిం మైనారిటీల్లో పార్టీ త‌రఫున క్రియాశీల‌కంగా ప‌నిచేసిన నేత‌ల్లో ఖాన్ ఒక‌రు. ముస్లిం ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో పార్టీకి మంచి ప‌ట్టును సాధించి పెట్టిన వారిలో ఖాన్ ఒక‌రుగా గుర్తింపు సంపాదించారు. విద్యార్థి ద‌శ నుంచే కాంగ్రెస్ వెంట న‌డిచిన ఖాన్‌… 4 ద‌శాబ్దాలుగా పార్టీలోనే కొన‌సాగారు.

MP M A Khan complains on Yashoda Hospital

పార్టీ కార్య‌కర్త‌ల‌తో పూర్తిగా సంబంధాలు తెంచేసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల‌కూ దూరంగా జ‌రిగిపోయింద‌ని ఎంఏ ఖాన్ త‌న రాజీనామాలో పేర్కొన్నారు. పార్టీ అభ్యున్న‌తి కోసం సీనియ‌ర్లు ఇస్తున్న స‌ల‌హాల‌ను పార్టీ కీల‌క నేత‌లు అప‌హాస్యం చేస్తున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పార్టీ అధిష్ఠానం చుట్టూ చేరిన ఓ కోట‌రీ కీల‌క నేత‌లంద‌రినీ పార్టీకి దూరం చేస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో పార్టీకి రాజీనామా త‌ప్పించి త‌న‌కు మ‌రో ప్ర‌త్యామ్నాయం క‌నిపించ‌డం లేద‌ని ఖాన్ తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news