సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన మహర్షి భారీ సక్సెస్ అయిన నేపథ్యంలోనూ…అర్ధశత దినోత్సవం పూర్తిచేసుకున్న సందర్భంగాను హైదరాబాద్ శిల్పకళా వేదికలో అభిమానుల సమక్షంలో భారీ ఈవెంట్ కు సన్నాహాకాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈనెల 28న సెలబ్రేషన్స్ డేట్ గా నిర్ణయించారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మాల కన్ను మూసిన నేపథ్యంలో ఈవెంట్ రద్దుచేస్తారా? వాయిదా వేస్తారా? అన్నది పెద్ద ప్రశ్న. ఇప్పటివరకూ మహేష్ వ్యక్తిగత పీ ఆర్ నుంచి గానీ మహర్షి నిర్మాతల పీర్ టీమ్ నుంచి గానీ ఎలాంటి అధికారిక సమాచారమైతే లేదు.
అయితే శుక్రవారం మాత్రం ఈవెంట్ జరిగే అవకాశాలైతే లేవు. ఓ లెజెండరీ యాక్టర్స్ కన్నుమూసిన నేపథ్యంలో మూడు రోజుల కార్యక్రమం కూడా పూర్తికాకుండా మహర్షి 50 రోజుల వేడుక చేసే ఛాన్స్ లేదు. అయితే చిత్ర నిర్మాతల క్లోజ్ సోర్సెస్ నుంచి ఓ వార్త వినిపిస్తోంది. కార్యక్రమాన్ని తాత్కలికంగా వాయిదా వేసి కొన్ని రోజులు గడిచిన తర్వాత సింపుల్ గా ఓ హోటల్ లో కానిచ్చేస్తే బాగుటుందని ఆలోచన చేస్తున్నారుట. భారీగా చేయడం కన్నా…మహేష్ అందుబాటును బట్టి అభిమానులకు ఆహ్వానం లేకుండా తూ తూ మంత్రం గా పూర్తిచేయడమే బెటర్ అని అనుకుంటున్నారుట. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
విజయ నిర్మల మరణ వార్త తెలిసిన వెంటనే ఆమెకు నివాళిగా కొంతమంది షూటింగ్ లు నిలిపివేసినట్లు తెలుస్తోంది. తమకు అందుబాటులో ఉన్న మాధ్యమాల ద్వారా ఇప్పటికే తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు సినిమా దర్శక, రచయితల సఘం, `మా` అసోసియేషన్ అంతా నివాళులు అర్పించారు. విజయ నిర్మల అంత్యక్రియలు శుక్రవారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేపటి వరకూ షూటింగ్ లకు బ్రేక్ పడినట్లే. ఆమె దహన కార్యక్రమాలు అనంతరం తిరిగి షూటింగ్ లు ప్రారంభించనున్నారని తెలుస్తోంది.