నయా రాయ్ పూర్.. ఇది సరికొత్త సిటీ.. దేశంలోనే బెస్ట్ స్మార్ట్ సిటీల్లో ఒకటి..!

-

మన దేశంలో మెట్రో సిటీల పేర్లు చెప్పాలని అడిగితే.. టక్కున ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్, పూణె అని చెబుతారు కదా. రాయ్ పూర్ పేరు మాత్రం మీకు గుర్తుకు రాదు. కానీ.. నిజం ఏంటంటే.. మనం ఇప్పుడు మెట్రో సిటీలు అని అనుకుంటున్న నగరాల కంటే కూడా ఎక్కువ అభివృద్ధి చెందిన, చెందుతున్న సిటీ రాయ్ పూర్.

ఈరోజు శుక్రవారం.. సాయంత్రం 6 అవుతోంది. మీరు సైకిల్ మీద వెళ్తున్నారు. ఆఫీసు నుంచి సైకిల్ మీద వెళ్తున్నారు మీరు. రోడ్డు మీద సైకిల్ వెళ్లడానికి సపరేట్ లేన్ ఉంది. ఆ లేన్ లోనే మీరు వెళ్తున్నారు. వీకెండ్ ఎలా గడపాలా అని ఆలోచిస్తూ మీరు సైకిల్ తొక్కుతున్నారు. మీరు సైకిల్ తొక్కుతుంటే పక్కనున్న చెట్లు మీకు చల్లటి గాలిని ఇస్తుంటే మీకు ఇంకా ఆనందంగా ఉంది. ఆ చల్లని గాలిని పీల్చుతూ అలా ముందుకు వెళ్తున్నారు. రోడ్డు మీద హారన్ సౌండ్ లేదు. ట్రాఫిక్ గోల లేదు. నాలుగు లేన్లు ఉన్న రోడ్ల మీద వాహనాలు హాయిగా వెళ్తున్నాయి. అందుకే ట్రాఫిక్ గోలే లేదు. రోడ్డు కూడా ఎటువంటి గుంతలు లేకుండా ఉంది. ఇంతలో మీ ఇల్లు వచ్చింది. మీరు మీ ఇంటికి వెళ్లారు.

మీ ఇంట్లో కరెంట్ పోనే పోదు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తారు. మీ ఇంట్లో వర్షపు నీటి కోసం ఇంకుడు గుంతలు కూడా ఉన్నాయి. మీ ఇంట్లో ఉపయోగించిన నీటితో మళ్లీ శుభ్రం చేసుకుంటారు. మీ బిల్లులు, ఇతర సర్వీసులన్నీ మొబైల్ ద్వారానే చేసేస్తారు.

సిటీలో ఎక్కడ చూసినా ఎల్ఈడీ లైట్లే. ఇక.. ఈ వీకెండ్ కు ఎక్కడికి వెళ్లాలి.. జంగిల్ సఫారీ వైల్డ్ లైఫ్ పార్క్ కు వెళ్లాలా? లేక ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూడాలా? అని డిసైడ్ చేసుకుంటున్నారు.

హే.. ఆపు.. ఇక ఆపు.. ఏం మాట్లాడుతున్నారు మీరు. ఏమైనా కల కన్నారా? అని అంటున్నారా? ఇది కల అస్సలు కాదు. నిజం.. ఇదంతా నిజమే.. ఆ నిజమే నయా రాయ్ పూర్. అవును. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ గురించే మనం మాట్లాడుకునేది.

మన దేశంలో మెట్రో సిటీల పేర్లు చెప్పాలని అడిగితే.. టక్కున ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్, పూణె అని చెబుతారు కదా. రాయ్ పూర్ పేరు మాత్రం మీకు గుర్తుకు రాదు. కానీ.. నిజం ఏంటంటే.. మనం ఇప్పుడు మెట్రో సిటీలు అని అనుకుంటున్న నగరాల కంటే కూడా ఎక్కువ అభివృద్ధి చెందిన, చెందుతున్న సిటీ రాయ్ పూర్. నమ్మశక్యంగా లేదు కదా. కానీ.. నమ్మాల్సిందే. నమ్మి తీరాల్సిందే. ఈ కథనం మొత్తం చదివితే మీరు ఒప్పుకుంటారు. నయా రాయ్ పూర్ నిజంగానే బెస్ట్ ప్లాన్డ్ స్మార్ట్ సిటీ అని.

దేశంలో ఒక ప్లాన్ ప్రకారం అభివృద్ధి చెందుతున్న నగరాల్లో రాయ్ పూర్ కూడా ఉంది. ఇది కూడా స్మార్ట్ సిటీయే. ఎందుకు రాయ్ పూర్ స్మార్ట్ సిటీయే తెలుసుకోవాలనుందా. పదండి.. ఓసారి రాయ్ పూర్ కు.

సిటీలో ఎక్కడ చూసినా పచ్చదనమే

అవును.. రాయ్ పూర్ నిజానికి సిటీ. కానీ.. అది చూస్తే మీకు సిటీలా కనిపించదు. ఎక్కడ చూసినా చెట్లే. ఇదివరకు ఉన్న రాయ్ పూర్ కు, ఇప్పటికి చాలా తేడా ఉంటుంది. 27 శాతానికి పైగా చెట్లు ఉన్నాయి అక్కడ. సిటీకి పచ్చదనమే అందం, అలంకారం. రణగోర ధ్వనుల మధ్య స్వచ్ఛమైన గాలిలేక ఎన్నో సిటీల ప్రజలు అల్లాడుతున్నారు. కానీ.. రాయ్ పూర్ లో ఎక్కడ చూసినా మీకు చెట్లే కనిపిస్తాయి. అవన్నీ నాటినవే. అవి ఇప్పుడు పెరిగి పెద్దవుతున్నాయి. సిటీలో ఉండే గాలి కాలుష్యాన్ని అవి నివారిస్తాయి. సిటీలో స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. ఉష్ణోగ్రతలు ఎప్పుడూ సాధారణంగా ఉంటాయి. చెట్లు ఎక్కడుంటే అక్కడ స్వచ్ఛత ఉంటుంది.

అందుకే.. రాయ్ పూర్ లో ఉన్న 27 శాతం ప్లేస్ ను చెట్లు నాటడానికే ఉపయోగిస్తున్నారు. దీంతో రాయ్ పూర్ లో మరో అడవిని సృష్టిస్తున్నారు.

దానిలో భాగంగా నిర్మించిన ఎకత్మ్ పాత్ ఓ ఉదాహరణ. రాయ్ పూర్ కు 2.2 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పార్క్.. ఉదయం పూట వాకింగ్ చేసేవాళ్లకు స్వర్గం. అక్కడికి వెళ్లి కాసేపు స్వచ్ఛమైన గాలి పీల్చి కాసేపు ప్రశాంతంగా వ్యాయామం చేసుకునే వాళ్లు కోకొల్లలు. అది న్యూఢిల్లీలోని రాజ్ పథ్ లా ఉంటుంది.

పుర్కౌతి ముక్తంగన్.. అది సాంస్కృతిక గ్రామం పేరు. అది సాంస్కృతిక వారసత్వ గ్రామం. సిటీలోనే ప్రముఖ ప్రాంతం. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నయా రాయ్ పూర్ లో బొటానికల్ గార్డెన్ ను ప్రారంభించారు. ఆసియాలోనే అతి పెద్ద సఫారీ ఫారెస్ట్ జంగిల్ సఫారీని కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. సిటీలో రోడ్లు కూడా అద్భుతంగా నిర్మించారు. సైకిల్ కు ఒక లేన్, నడిచే వాళ్లకు ఒక లేన్.. ఎక్కువ వాహనాలు ఉపయోగించకుండా, నడక, సైకిళ్లు ఉపయోగించే విధంగా రోడ్లను నిర్మించారు.

అంతే కాదు.. సిటీలో ఉన్న ఇళ్లలో ఖచ్చితంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. దీంతో వర్షపు నీరు అక్కడే ఇంకి పోతుంది. ఇంకా సోలార్ ఎనర్జీ, ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ రాయ్ పూర్ లో ఉన్నాయి. ప్రస్తుతం రాయ్ పూర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ది నయా రాయ్ పూర్ డెవలప్ మెంట్ అథారిటీ(ఎన్ఆర్డీఏ). రాయ్ పూర్ రీజియన్ లో 55 రిజర్వాయర్లు ఉన్నాయి. దీంతో రాయ్ పూర్ లో నీటి సమస్య కూడా ఉండదు.

ఐఐటీ బాంబే, బెంగళూరు ఐఐఎస్సీ సహాయంతో వేస్ట్ మేనేజ్ మెంట్, డిస్పోజల్ సిస్టమ్ ను పక్కాగా అమలు చేస్తున్నారు. ఇలా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందడం కోసం కావాల్సిన అన్ని ప్లాన్స్ ను రాయ్ పూర్ లో అవలంభిస్తున్నారు. దానికి రాయ్ పూర్ ప్రజలు కూడా పూర్తి మద్దతు తెలుపుతున్నారు. అందుకే.. రాయ్ పూర్ పక్కా ప్లాన్ ప్రకారం డెవలప్ అవుతున్న స్మార్ట్ సిటీల్లో ఒకటిగా ఉంది.

నిజంగా రాయ్ పూర్ అంతలా డెవలప్ చెందిదా? అనే డౌట్ మీకొస్తే.. కింది వీడియో చూడండి.

(Story, Images and Video Courtesy: YourStory)

Read more RELATED
Recommended to you

Latest news