టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల రాజేందర్ బయటకొచ్చేసి ఏడాది దాటేసింది..సరిగ్గా ఏడాది క్రితం హుజూరాబాద్ ఉపఎన్నిక జోరు మొదలైంది. ఎలాగైనా మళ్ళీ తన స్థానంలో గెలిచి తీరాలని బీజేపీలో చేరిన ఈటల పనిచేయగా, ఎలాగైనా ఈటలని ఓడించి హుజూరాబాద్ లో సత్తా చాటాలని టీఆర్ఎస్ ట్రై చేసింది. అయితే ఈటలని ఓడించడానికి టీఆర్ఎస్ ఎన్నిరకాలుగా ట్రై చేసిందో అందరికీ తెలిసిందే…వందల కోట్లు హుజూరాబాద్‌లో నిధులు పారించింది…అలాగే ఇతర పార్టీల అభ్యర్ధులని లాగేసుకున్నారు..ఒకటి అన్నీ రకాలుగా ఈటలని నిలువరించాలని ప్రయత్నించారు.
ఇదే క్రమంలో ఈటల ఓటమి కోసం ఎంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హుజూరాబాద్ లో మకాం వేశారో చెప్పాల్సిన పని లేదు. చాలామంది ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లో రాజకీయం చేశారు. ఈటల టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. ఈటలని ఓడిస్తామని సవాళ్ళు చేశారు. అబ్బో నానా రకాల ప్రయత్నాలు చేశారు.
కానీ ఎన్ని చేసిన హుజూరాబాద్ ప్రజలు మళ్ళీ ఈటలని గెలిపించుకున్నారు. అక్కడ నుంచి ఈటల దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. బీజేపీ బలం పెంచుతూనే వ్యక్తిగతంగా టీఆర్ఎస్ పై తనకున్న రివెంజ్ కూడా తీర్చుకునే విధంగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ లోని బలమైన నేతలని బీజేపీ వైపుకు లాగేస్తున్నారు. ఎక్కడకక్కడ టీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఈటల పనిచేస్తున్నారు.
ఇదే క్రమంలో హుజూరాబాద్ ఉపఎన్నికలో తనపై తీవ్ర విమర్శలు చేస్తూ..తనని ఓడిస్తానని సవాళ్ళు చేసిన కారు ఎమ్మెల్యేలపై కూడా రివెంజ్ తీర్చుకుంటానని ఈటల ఇప్పటికే ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే ఈటల రాజకీయం ఉంటుందని తెలుస్తోంది…తన నియోజకవర్గంలో వేలు పెట్టిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా ఈటల వేలు పెడుతున్నారు. ఉదాహరణకు అచ్చంపేటలో గువ్వల బాలరాజు, వరంగల్ ఈస్ట్ లో నన్నపునేని నరేందర్‌లు టార్గెట్‌గా ఈటల దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే వరంగల్ ఈస్ట్‌లో ఎర్రబెల్లి ప్రదీప్‌ని బీజేపీలోకి లాగారు. ఆయన ద్వారా నరేందర్‌కు చెక్ పెట్టాలని ఈటల చూస్తున్నారు. మొత్తానికి తనని ఓడించడానికి చూసిన ఏ టీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూడా ఈటల వదిలేలా లేరు.