తెలంగాణ మోడల్ అంటే కల్వకుంట్ల పరిపాలన విధానమా?: కిషన్ రెడ్డి

-

కేసీఆర్ తెలిసి మాట్లాడుతున్నారా.. లేక తెలియక మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియాకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిందే పది సార్లు చెప్పి, ప్రజలను భ్రమ పెట్టె ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ మోడల్ అంటే కల్వకుంట్ల పరిపాలన విధానమా ? అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.

ఫామ్ హౌస్ లో ఉండటంలో మోడల్ అంటూ ఎద్దేవా చేశారు. ధర్నా చౌక్ పై నిషేధం పెట్టిన గొప్ప ప్రజాస్వామ్య వాది కెసిఆర్ అని అన్నారు. 15 శాఖలు కల్వకుంట్ల కుటుంబంలో పెట్టుకుని రాష్ట్రాన్ని పాలిస్తున్నారని.. ఎన్నికల్లో ఫండింగ్ ఇస్తానని తన పర్యటనల్లో అక్కడి పార్టీలకు హామీ ఇస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ డబ్బులు తెచ్చి, యూపీ, బీహార్, పంజాబ్ లో పంచుతున్నారని అన్నారు.

గతంలో బీహార్ పై వ్యతిరేకంగా మాట్లాడి, ఇప్పుడెలా అక్కడికి కేసీఆర్ వెళ్లారని దుయ్యబట్టారు. తెలంగాణ లో ఎన్ని ఇల్లు కట్టిచ్చారో చెప్పాలన్నారు. ఉద్యమకారులను ప్రగతి భవన్ నుంచి నెట్టేశారని.. ద్రోహులను వెంట పెట్టుకుని.. దేశానికి నీతులు చెప్తున్నారని మండిపడ్డారు. ఓ పక్క అసద్ ను, మరో పక్క అక్బరుద్దీన్ ను పక్కన కూర్చో బెట్టుకుని మతపర రాజకీయాల గురించి మాట్లాడుతారని.. హైదరాబాద్ లో ఈమధ్య జరిగిన అల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news