టాలీవుడ్ హీరోయిన్ రష్మికతో రోహిత్ శర్మ రొమాన్స్ ?

-

ఆసియా కప్‌ 2022 లో బిజీగా ఉన్న రోహిత్ శర్మ సడన్ గా బాంబు పేల్చాడు. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. మెగా బ్లాక్ బస్టర్ అనే మూవీలో లీడ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్ విడుదలైంది. టైట్ ఫిట్ హాఫ్ షర్ట్ తో సాఫ్ట్వేర్ గెటప్ లో కనిపించాడు రోహిత్ శర్మ. ఎల్లుండి ట్రైలర్ లాంచ్ కానుంది.”ఒహ్సీమ్” ఈ సినిమాను సమర్పిస్తోంది.

అంతకంటే ఎక్కువ వివరాలు ఈ ఫస్ట్ లుక్ లో లేవు గాని, క్యూరియాసిటీని మాత్రం క్రియేట్ చేయగలిగింది. మల్టీ స్టారర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది మూవీ. తమిళ్ స్టార్ హీరో కార్తీ, బిసిసిఐ చైర్మన్, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, రష్మిక మందన్న, త్రిష ఇందులో నటిస్తున్నారు. ది కపిల్ శర్మ టాక్ షో ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కపిల్ శర్మ ఈ మూవీకి కర్త-కర్మ-క్రియగా వ్యవహరించారు. రోహిత్ శర్మతో పాటు, కార్తీ, సౌరవ్ గంగూలీ, రష్మిక మందన్న, త్రిష ఫస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news