నిరుద్యోగులకు శుభవార్త.. పీఎఫ్ లో 2189 ఉద్యోగాలకు నోటిఫికేషన్

-

దీనికోసం ఆన్ లైన్ లో అప్లయి చేసుకోవాలి. జూన్ 27, 2019 నుంచి జులై 21, 2019 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు కింది నోటిఫికేషన్ పీడీఎఫ్ ను చూడండి.

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పీఎఫ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్వో) దేశంలోని పలు పీఎఫ్ ఆఫీసుల్లో ఉద్యోగాలను నోటిఫికేషన్ విడుదలయింది. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్ మెంట్ ను నిర్వహిస్తున్నారు.

మొత్తం 2189 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. దీనికోసం ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. దాంతో పాటు డేటా ఎంట్రీలో గంటకు 5000 కీ డిప్రెషన్స్ వేగం ఉండాలి. వయసు 21072019 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ ఉద్యోగాల్లో ఎంపిక కోసం ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలు ఆగస్టు 31, సెప్టెంబర్ 1 న ఉంటాయి. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్లకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ లో కూడా పాస్ అయిన వాళ్లను ఉద్యోగంలోకి తీసుకుంటారు.

దీనికోసం ఆన్ లైన్ లో అప్లయి చేసుకోవాలి. జూన్ 27, 2019 నుంచి జులై 21, 2019 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు కింది నోటిఫికేషన్ పీడీఎఫ్ ను చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news