సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియా లో ఒక టెక్స్ట్ మెసేజ్ వైరల్ గా మారింది. ప్రభుత్వం ఆమోదించిన ఆయుష్ యోజన కింద నెలకి రూ.50,000 జీతంగా పొందేందుకు మీకు అర్హత వచ్చింది అని అందులో వుంది. పైగా చెక్ నౌ అంటూ ఒక లింక్ ని కూడా ఇస్తున్నారు. అయితే నిజంగా కేంద్రం ఆయుష్ యోజన కింద నెలకి రూ.50,000 జీతంగా ఇస్తోంద..? అందులో నిజం ఎంత అనేది చూస్తే..
A text message is being circulated with a claim that monthly monetary compensations are being provided under government approved "AYUSH Yojana" #PIBFactCheck:
▶️ This message is #Fake
▶️ Government of India is not running any such scheme. pic.twitter.com/kLibTFcNwh
— PIB Fact Check (@PIBFactCheck) September 4, 2022
ప్రభుత్వం ఆమోదించిన ఆయుష్ యోజన కింద నెలకి రూ.50,000 ఇవ్వడం అనేది నిజం కాదు. ప్రభుత్వం ఇలాంటిదేమీ తీసుకు రాలేదు. వస్తున్న టెక్స్ట్ మెసేజ్ లో నిజం లేదు. ఇది కేవలం ఫేక్ వార్త మాత్రమే. ఇందులో నిజం లేదు కనుక అనవసరంగా నమ్మి మోసపోవద్దు. ఇది కేవలం ఫేక్ వార్త మాత్రమే. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా ఇదే విషయం చెప్పింది.