తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే… సంతాప తీర్మానాలు ప్రవేశ పెట్టారు. మొదటగా.. మల్లు స్వరాజ్యంకి సంతాపం ప్రకటించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మల్లు స్వరాజ్యం..తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు అని కొనియాడారు. మద్యపాన నిషేధ ఉద్యమంలో ఆమెది చురుకైన పాత్ర అని తెలిపారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.
ఆమె సేవలు మరువలేనివి అని వివరించారు. అనంతరం మల్లు స్వరాజ్యం, జనార్థన్ రెడ్డిలకు సంతాపం తెలుపుతూ… రెండు నిముషాలు మౌనం పాటించింది సభ. అనంతరం సభను 12వ తేదీకి వాయిదా వేశారు. కాగా అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భట్టి విక్రమార్క, సీతక్క, పోదం వీరయ్య తదితరులు హాజరయ్యారు. సభను కనీసం 20 రోజులు జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.