చిరుతిళ్లని ఇలా తీసుకుంటే.. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి..!

-

చాలామంది స్నాక్స్ విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అయితే నిజానికి ఈ విధంగా స్నాక్స్ ను తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండాలంటే కచ్చితంగా ఈ స్నాకింగ్ హ్యాబిట్స్ ని ఫాలో అవ్వండి. అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది.

రాత్రి ఆలస్యంగా ఐస్క్రీమ్లు తీసుకోవద్దు:

ఐస్ క్రీమ్ లో పంచదార చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని మీరు రాత్రి నిద్రపోయే ముందు పంచదార ఎక్కువ వుండే వాటిని తీసుకోకూడదు అలానే ఐస్క్రీమ్ కి బదులుగా మీరు ఫైబర్ లేదా ప్రోటీన్ ఉండే వాటిని తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.

స్నాక్స్ తినేటప్పుడు గ్రీన్ టీ తాగండి:

గ్రీన్ టీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండాలంటే గ్రీన్ టీ ని స్నాక్స్ తీసుకునేటప్పుడు తీసుకోండి. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.

కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను చూసుకుంటూ వుండండి:

కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కూడా మరీ ఎక్కువ తీసుకోకండి కేవలం కొంచెం శాతం ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ లేదా ప్రోటీన్స్ ను తీసుకోండి. అప్పుడు షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.

నట్స్ ని తీసుకోండి:

పల్లీలు మొదలైన నట్స్ ని స్నాక్స్ కింద తీసుకుంటే మంచిది. ఇలా ఈ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది పైగా షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news