ఈటెల రాజేందర్ తో సినీనటి దివ్యవాణి భేటీ

-

కేంద్రంలో మూడవసారి అధికారంలోకి రావడంతో పాటు.. తెలంగాణలో సత్తా చాటాలని భావిస్తున్న బిజెపి ఆ దిశగా కసరత్తు వేగవంతం చేసింది. తెలంగాణలో ఇప్పటికే అధికార టిఆర్ఎస్, బిజెపి మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీల నుంచి ప్రముఖ నాయకులని బిజెపిలోకి తీసుకువచ్చే బాధ్యతలను అధిష్టానం మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈటెల తన పని తాను చేసుకుపోతున్నారు.

దీనికి తోడు సినీ గ్లామర్ ని కూడా వాడుకోవాలనుకుంటుంది బిజెపి. ఇప్పటికే విజయశాంతి, జయప్రద, జీవిత తదితర యాక్టర్లు బిజెపిలో ఉన్నారు. జయసుధ కూడా బిజెపిలో చేరబోతుందని ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇటీవలే టిడిపి పార్టీకి గుడ్ బై చెప్పిన మరో సినీనటి దివ్యవాణి బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను కలిసారు. హైదరాబాదులోని షామీర్పేటలో ఉన్న ఈటెల నివాసానికి దివ్యవాణి వెళ్లారు. వీరి సమావేశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. దివ్యవాణిని ఈటెల బీజేపీలోకి ఆహ్వానించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news