తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి పోటీ చేయరని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఈ విషయంపై ప్రస్తుతం రికార్డెడ్‌గా ధ్రువీకరించలేనని అన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదోనని ఇప్పుడూ చెప్పలేనని దాటవేశారు.
ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని.. ఎలాంటి నిర్ణయాన్నైనా ప్రకటించే ముందు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో కాంగ్రెస్ కార్యకర్త పోటీచేస్తారని తాను ప్రకటించినట్లుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో జగ్గారెడ్డి స్పందించారు.
అసలేం జరిగిందంటే.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. తన స్థానంలో సంగారెడ్డిలోని ఓ కార్యకర్త పోటీ చేస్తారని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీకి పార్టీ శ్రేణులు కార్యకర్తను వద్దంటే.. తన భార్య నిర్మలను బరిలో దింపుతానని జగ్గారెడ్డి తెలిపారు. తాను మాత్రం 2028 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.