హిందూ సంప్రదాయంలో శంఖంకు గొప్ప శక్తి ఉంది. పవిత్రమైనదిగా భావిస్తారు. వీటిని కొందరు పూజగదిలో పెట్టుకుంటే మరికొందరు షోకేస్ అల్‌మరాలో పెడతారు. శంఖాన్ని కేవలం రుషులు, మన ఇంటి ముందుకు అప్పుడప్పుడు వచ్చే యాచకులు మాత్రమే ఉపయోగిస్తారు అని మనం అనుకుంటాం.. కానీ శంఖం ఊదడంలో ఓ గమ్మైత్తైన ఫీల్ ఉంటుంది. ఆ శబ్ధంలో ఏదో మైమరపు ఉంటుంది. రోజూ శంఖం ఊదడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయట.. అవేంటంటే..
నిత్యం శంఖం వాయించడం వల్ల ముఖంపై ఉండే ముడతలు తగ్గుతాయని చాలా మంది చెబుతుంటారు. ఫలితంగా, చర్మం బిగుతుగా మారుతుందట. వయస్సు పరంగా ముఖంపై ఏర్పడే వృద్దాప్య ఛాయాలు తగ్గుతాయట. దీనికి కారణం కూడా చాలా సహజమైనది, క్రమం తప్పకుండా శంఖం ఉదడం వల్ల నోటి కండరాలపై ఒత్తిడి పడుతుంది. దీని కారణంగా అనేక ప్రయోజనాలు ఉంటాయి. అది లాజిక్.
క్రమం తప్పకుండా డైలీ శంఖం వాయించడం వల్ల ఊపిరితిత్తులకు కూడా మేలు జరుగుతుందని చాలా మంది నిపుణులు అంటున్నారు. ఇది ఫారింక్స్ కండరాలకు వ్యాయామం చేస్తుంది. దీంతో ఊపిరితిత్తులు బలంగా మారి శ్వాస సామర్థ్యం పెరుగుతుందట. అసలే ఈరోజుల్లో కరోనా వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం చాలా దెబ్బతినింది.. కాబట్టి ఓ సారి ట్రై చేయండి.
నిత్యం శంఖం వాయించడం వల్ల కడుపు సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా, ఇది డిప్రెషన్ సమస్యను కూడా తగ్గిస్తుంది
క్రమం తప్పకుండా శంఖం వాయించడం వల్ల మూత్ర నాళాలు, పొత్తి కడుపు, డయాఫ్రాగమ్, మెడ, భుజం కండరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పురుషులలో ప్రోస్టేట్ గ్రంధికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది
శంఖం వాయించడం వల్ల సంప్రదాయ కోణం ఎంత ఉందో.. శాస్త్రీయ కోణం కూడా అంతే ఉంది అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు.. మీరు ఈసారి శంఖం కనిపిస్తే.. తప్పకుండా తీసుకోని..డైలీ వాయించడానికి ట్రై చేయండి. మంచి ఫలితాలు ఉన్నప్పుడు చేస్తే తప్పేముంది. ఇది వాయించడం వల్ల ఎలాంటి నష్టాలు లేవని నిపుణులు అంటున్నారు.