పోస్టాఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ మధ్య చాలా మంది తమకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. మీరు కూడా మీకు నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే ఈ స్కీమ్ గురించి చూడండి. పోస్టాఫీస్ అందించే స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. మరి ఇక దాని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే రూ. 16 లక్షలు పొందే అవకాశం ఉంది. ఈ స్కీమ్ లో మీరు వంద రూపాయిల నుండి కూడా ఇన్వెస్ట్ చెయ్యచ్చు. ఎలాంటి రిస్క్ ఉండదు. కనుక ఇందులో మీరు చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ఐదేళ్లు టెన్యూర్. కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కూడా. దీర్ఘకాల టెన్యూర్ అయితే మెచ్యూరిటీలో అధిక మొత్తాన్ని పొందవచ్చు.
ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తూ వెళ్లాలి. మీరు ఇన్వెస్ట్ చేసే దాని మీద వడ్డీ వస్తుంది. వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడైతే వడ్డీ రేటు 5.8 శాతంగా ఉంది. ఆర్‌డీ అకౌంట్ తెరిచిన తర్వాత నెలకు రూ. 10 వేలు డిపాజిట్ చేస్తూ వెళితే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ. 16 లక్షలకు పైగా వస్తాయి.
అంటే రోజుకు దాదాపు రూ.330 పొదుపు చెయ్యాల్సి వుంది. ఈ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలంటే మీకు దగ్గరలో ఉంటే పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఓపెన్ చెయ్యచ్చు. స్కీమ్‌లో చేరిన వారికి లోన్ సదుపాయం కూడా వుంది. ఏడాది తర్వాత రుణం వస్తుంది.