బీసీసీఐ ఛీప్ గంగూలీ, జైషాలకు భారీ ఊరట లభించింది. మరో మూడేళ్ల పాటు వారి పదవులు పదిలంగా ఉండనున్నాయి. బీసీసీఐ రాజ్యాంగంలో సవరణలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. దీంతో అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా, తమ పదవుల్లోనే కొనసాగనున్నారు. ఈ సెప్టెంబర్ తో వారి పదవి కాలం పూర్తవుతుంది.
ఆ కూలింగ్ ఆఫ్ పీరియడ్ లో ఇప్పుడు మార్పులు జరగడం వల్ల మరో మూడేళ్ల పాటు గంగూలీ, జైషా ద్వయం బీసీసీఐ ని ముందుండి నడిపించనుంది. 2019 లో బీసీసీఐ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన గంగూలీ బోర్డుని విజయవంతంగా నడిపిస్తూ వచ్చాడు.
బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం బీసీసీఐ లేదంటే రాష్ట్ర క్రికెట్ సంఘంలో మూడేళ్ల పాటు వరుసగా రెండుసార్లు మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. అధ్యక్షుడు కాకముందు గంగూలీ, 2014లో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేస్తే, గుజరాత్ క్రికెటర్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ గా జైషా విధులు నిర్వర్తించారు. దీంతో వారు కొనసాగే అవకాశం లేదు. ఇప్పుడు అదే విషయమై వాదనలు విని సవరణలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.