జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే.. సెప్టెంబర్ 17 సందర్భాన్ని కూడా వక్రీకరిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన వేడకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రతిఘాతక శక్తులు రెచ్చిపోతున్నాయని.. మతతత్వ శక్తులు తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరించి, మలినం చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే.. సెప్టెంబర్ 17 సందర్భాన్ని కూడా వక్రీకరిస్తున్నారని మంత్రి కేటీఆర్ వాఖ్యానించారు.
స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు మంటలు రగిలిస్తున్నాయన్న మంత్రి కేటీఆర్.. ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో ఉండాలే తప్ప.. అశాంతి, అలజడులతో కాదన్నారు. మతోన్మాద శక్తుల నుంచి మరోసారి జాగ్రత్త పడాల్సిన అవసరముందని, స్వరాష్ట్రం ఏర్పడ్డ ఎనిమిదేండ్లలోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా, సఫల రాష్ట్రంగా తీరిదిద్దామని తెలిపారు మంత్రి కేటీఆర్. నాటికి నేటికీ తెలంగాణలో వచ్చిన మార్పులకు దేశం మొత్తం మనవైపే చూస్తుందన్నారు మంత్రి కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా ఎన్నో అనితరమైన పనులను సుసాధ్యం చేశామని, రాజన్న సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి , సంక్షేమంలో ముందంజలో నిలిపామని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనదక్షత, సమర్థ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.