ఈ వ్యాపారం చేస్తే ఆల్‌ టైమ్‌ డిమాండ్‌.. పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ..!

-

వ్యాపారం చేయాలి.. కానీ పైసలు ఎక్కువ లేవు ఏది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా..? అయితే ఓ సారి ఈ వ్యాపారం వైపు చూడండి. ఈ బిజినెస్‌ చేయడానికి పైసలు ఎక్కువగా అవసరం లేదు. ఆల్‌టైమ్‌ డిమాండ్‌ ఉండే బిజినెస్. ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

భారతదేశంలో మసాలాలు, మసాలా దినుసులకు (Masala Spices) విపరీతమైన డిమాండ్ ఉంది. దేశంలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు మిలియన్ల టన్నుల్లో ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో చాలా తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టినా మంచి లాభాలు పొందవచ్చు.

తక్కువ పెట్టుబడితో మసాలా తయారీ వ్యాపారం ప్రారంభించి లాభాలను సంపాదించవచ్చు. మసాలా తయారీ యూనిట్ ప్రారంభించడానికి ఒక్కసారి పెట్టుబడి పెడితే తీసుకోవాలి. ఎప్పుడూ డిమాండ్ ఉండే బిజినెస్ ఇది. ఇండియన్స్‌ సుగంధ ద్రవ్యాలకు ఎంత ఇంపార్టెన్స్‌ ఇస్తారో మనకు తెలుసు.

భారతదేశం మిలియన్ల టన్నుల వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది తయారు చేయడం సులభం. వేర్వేరు ప్రాంతాలకు వేర్వేరు రుచిని అందించే మసాలాలు ఉంటాయి. ఈ రుచి గురించి, ప్రజలు ఇష్టపడే మసాలాల గురించి తెలిస్తే చాలు. మసాలా తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు.

సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి బ్లూప్రింట్‌ను ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) నివేదికలో ఇచ్చారు. ఉంది. దీని ప్రకారం… సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు రూ.3.50 లక్షలు వెచ్చించాలి. 300 చదరపు అడుగుల బిల్డింగ్ షెడ్డుకు రూ.60,000, పరికరాల రూ.40,000 ఖర్చవుతుంది. ఇది కాకుండా మసాలాలు తయారు చేసేందుకు రూ.2.50 లక్షలు అవసరం. ఈ మొత్తంతో మీ వ్యాపారం ప్రారంభమవుతుంది.

మీ వద్ద అంత మొత్తం లేకపోతే, మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి బ్యాంకు నుంచి లోన్ కూడా తీసుకోవచ్చు. ప్రధానమంత్రి ఉపాధి పథకం కింద ఈ వ్యాపారం కోసం రుణం తీసుకోవచ్చు. ముద్ర లోన్ స్కీమ్ ద్వారా కూడా రుణాలకు అప్లై చేయొచ్చు. ప్రాజెక్టు నివేదిక ప్రకారం.. ఏటా 193 క్వింటాళ్ల మసాలా ఉత్పత్తి చేయవచ్చు.

మార్కెట్‌లో మన ప్రొడెక్ట్‌ క్లిక్‌ అయితే చాలు..డిమాండ్‌ అదే పెరుగుతుంది. నాణ్యమైన, రుచికరమైన మసాలను అందిచడమే ధ్యైయంగా పెట్టుకుని వ్యాపారం మొదలుపెట్టొచ్చు. అయితే ఏ దినుసులను కలపాలి, ఏ రుచికోసం ఎలా చేయాలి, ఏ ఏరియాలో ఏది ఫేమస్‌ ఇలాంటి వాటిపై అవగాహన ఉండాలి.
Attachments area

Read more RELATED
Recommended to you

Latest news