అలాంటి వాళ్లను బ్లాక్ చేసేస్తా: అనసూయ

-

సోషల్ మీడియాలో కూడా తనపై ఎవరైనా చెడుగా ప్రచారం చేస్తే.. విమర్శిస్తే వెంటనే స్పందించి.. వారికి కౌంటర్ ఇస్తుంటుంది. తాజాగా.. ఇలా మరో ట్వీట్ చేసి సంచలనం సృష్టించింది అనసూయ.

యాంకర్ అనసూయ.. ముక్కుసూటి వ్యక్తిత్వం గల వ్యక్తి. తనకు నచ్చిందే చేస్తుంది. ఎవ్వరి మాటా వినదు. తనపై వచ్చే విమర్శలపై కూడా ఘాటూగానే స్పందిస్తుంటుంది. తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ లో అనసూయ ఓ ట్వీట్ చేసింది.

తనను సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నవారిపై ఉక్కుపాదం మోపింది. అనుచితంగా తనపై కామెంట్స్ చేసేవాళ్లను బ్లాక్ చేసేస్తా.. అంటూ బెదిరించింది.

నా అకౌంట్ నాఇష్టం. వితండవాదానికి నా ట్విట్టర్ అకౌంట్ పేజీలో ఆస్కారం లేదు. చెడు ఉద్దేశాలున్నవారిని బ్లాక్‌ చేసే స్వేచ్ఛ నాకెప్పుడూ ఉంటుంది. ఒక సెకన్ కూడా వాళ్ల గురించి నేను ఆలోచించను. ఇది నా అకౌంట్. నేను ప్రశాంతంగా ఉండాలంటే ఏ చేయాలో అదే చేస్తా.. అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది.

ఇంతకీ.. ఆమె హర్ట్ అయ్యేలా… ఆమెను ఎవరు విమర్శించారు.. అనేదే ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. అయితే.. యాంకర్ అనసూయపై ఇప్పుడే కాదు.. చాలారోజుల నుంచి విమర్శలు వస్తూనే ఉంటాయి. ఆమె.. బయట ఫ్యాన్స్ కలిసినా కూడా కొంచెం కేర్ లెస్ గా మాట్లాడుతుందని.. సెల్ఫీలు కూడా తీసుకోనీయదనే విమర్శలు ఉన్నాయి.

సోషల్ మీడియాలో కూడా తనపై ఎవరైనా చెడుగా ప్రచారం చేస్తే.. విమర్శిస్తే వెంటనే స్పందించి.. వారికి కౌంటర్ ఇస్తుంటుంది. తాజాగా.. ఇలా మరో ట్వీట్ చేసి సంచలనం సృష్టించింది అనసూయ. అయితే.. అనసూయ ట్వీట్ పై స్పందించిన నెటిజన్లు కూడా ఆమె ట్వీట్ పై గరం అయ్యారు.

మాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. మాకూ పర్సనల్ అకౌంట్లు ఉంటాయి. మా పర్సనల్ అకౌంట్లలో మాకు నచ్చింది రాసుకుంటాం.. అంటూ కౌంటర్ అటాక్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news