ధోనీ త్వరలో బీజేపీలో చేరుతాడని ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అక్టోబర్‌లో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ధోనీ ప్రచారం చేస్తాడని.. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తాజాగా కథనాన్ని వండి వడ్డించింది.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 నేపథ్యంలో టీమిండియా ఆటగాడు ధోనీపై ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. వాటిల్లో ఒకటి ధోనీ రిటైర్మెంట్. ధోనీకి ఈ వరల్డ్ కప్పే ఆఖరిదని, ఈ టోర్నీ తరువాత అతను రిటైర్ అవుతాడని సోషల్ మీడియా కోడై కూసింది. కానీ వార్తలకు ధోనీ చెక్ పెట్టాడు. ఈ టోర్నీ తనకు ఆఖరిది కాదని, అసలు తాను ఎప్పుడు రిటైర్ అవుతానో తనకే తెలియదని స్పష్టం చేశాడు. దీంతో ధోనీ రిటైర్మెంట్ వార్తలు ఆగిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే…
ధోనీ త్వరలో బీజేపీలో చేరుతాడని ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే అదే కాదు, ఏదైనా పార్టీలో చేరాలంటే ముందు అతను రిటైర్ అవ్వాలి కదా. కనుక వచ్చే అక్టోబర్ నాటికి ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరుతాడని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్‌లో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ధోనీ ప్రచారం చేస్తాడని.. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తాజాగా కథనాన్ని వండి వడ్డించింది. దీంతో ఇప్పుడీ విషయం సంచలనం రేపుతోంది.
ధోనీ, అమిత్‌షా ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను చూపిస్తూ కొందరు ఈ ప్రచారం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం.. ధోనీ వరల్డ్ కప్ నుంచి రాగానే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి బీజేపీలో చేరుతాడని ప్రచారం చేస్తున్నారు. అయితే ధోనీ గనక తమ పార్టీలో చేరి ప్రచారం చేస్తే ఎన్నికల్లో తమకు అది ఎంతగానో ఉపయోగపడుతుందని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నదట. అందుకనే పలువురు బీజేపీ పెద్దలు ధోనీని తమ పార్టీలోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారట. మరి అసలు ధోనీ నిర్ణయం ఏమిటన్నది.. కొంత కాలం వరకు వేచి చూస్తేనే కానీ తెలియదు..!