చెక్ బౌన్స్ కేసులో కొత్త రూల్స్..?

-

ఆర్థిక మంత్రిత్వ శాఖకు పరిశ్రమల విభాగం పీహెచ్‌డీసీసీఐ చెక్ బౌన్స్ విషయంలో కఠినంగా ఉండాలని అంది. చెక్కు జారీ చేసిన వారి ఉపసంహరణను కొన్ని రోజులు నిలిపివేయాలంది. చెక్కు చెల్లించని తేదీ నుండి 90 రోజులలోపు ఇరువురి మధ్య సమస్యను పరిష్కరించాలని పిహెచ్‌డిసిసిఐ అంది. ట్రాన్సక్షన్స్ ని నిర్వహించేందుకు చెక్కు ముఖ్యం.

ఒక చెక్కు ద్వారా మనం డబ్బులను తీసుకోవచ్చు. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు చెక్కుని వినియోగిస్తుంటాయి. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు అంతర్గతంగా బదిలీ చేయడానికి లేదా తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అయితే కొన్ని సార్లు ఇది బౌన్స్ అవ్వచ్చు. ఇలా చెక్కు వలన కొనుగోలుదారు మరియు అమ్మేవారి మధ్య నమ్మకం పోతోంది.

పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రాకు చెక్ బౌన్స్ సమస్యను చెబుతూ లేఖ వ్రాసారు. అయితే దీనిపై పీహెచ్‌డీసీసీఐ జనరల్ సెక్రటరీ సౌరభ్ సన్యాల్ ఇలా అన్నారు… భారత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పెంచాలని.. వ్యాపారాన్ని ఈజీ చేయడంపై దృష్టి పెడుతోంది.

చెక్కుల బౌన్స్‌ వంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. చెక్కు జారీ చేసేవారి ఖాతా నుండి ఏమైనా పేమెంట్ చేయడానికి ముందు బౌన్స్ అయిన చెక్కును బ్యాంకింగ్ వ్యవస్థలోనే చెల్లించాలని చెప్పారు. చెక్ బౌన్స్ కేసు మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ వాళ్ళకి కష్టమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news