మునుగోడు ఉపఎన్నికలో గెలవడానికి ఎవరికి వారు అదిరిపోయే వ్యూహాలతో ముందుకెళుతున్నారు.. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య ట్రైయాంగిల్ ఫైట్ నడుస్తోంది. ఈ ఫైట్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో అర్ధం కాకుండా ఉంది. ఎన్నిక నోటిఫికేషన్ రాక ముందు నుంచి పార్టీలు దూకుడుగా ప్రచారం చేస్తున్నాయి. నోటిఫికేషన్ వచ్చాక మరింత దూకుడుగా ముందుకెళుతున్నాయి. ఇప్పటికే బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు.
అలాగే మునుగోడులో గెలిచేందుకు భారీగా ఖర్చు పెట్టేందుకు కూడా పార్టీలు వెనుకాడటం లేదు. అయితే ఈ పోరులో టీఆర్ఎస్-బీజేపీతో పోలిస్తే కాస్త కాంగ్రెస్ వెనుకబడినట్లు కనిపిస్తోంది. పైగా ఆ పార్టీకి చెందిన నాయకులని టీఆర్ఎస్-బీజేపీలు లాగేసుకుంటున్నాయి. ఇటు ఆర్ధిక పరంగా కూడా టీఆర్ఎస్-బీజేపీలు కంటే కాంగ్రెస్ వెనుకపడి ఉంది. కానీ ఎంత వెనుకపడిన మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం ఉంది. అసలు కాంగ్రెస్ అభిమానులు ఓట్లు..కాంగ్రెస్‌కు పడేలా చేస్తే చాలు..గెలుపు ఈజీ.
ఇక అందుకోసం ఇప్పటికే అభ్యర్ధిగా ఉన్న స్రవంతి గ్రామం గ్రామం తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. స్రవంతికి మద్ధతుగా రేవంత్ రెడ్డి, ఇతర నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే మునుగోడు ఉపఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా సిట్టింగ్ సీటుని కాపాడుకుని..తెలంగాణ రాజకీయాల్లో రేసులోకి రావాలని చూస్తున్నారు. ఇదే క్రమమో రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ఒకటి తీసుకున్నారని తెలుస్తోంది.
అది ఏంటంటే మునుగోడులో గెలవడం కోసం ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ టీంతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిసింది. ఐప్యాక్ నుంచి పీకే ఎప్పుడో బయటకొచ్చేశారు. ఐప్యాక్ టీం స్వతహాగా పనిచేస్తుంది. మొన్నటివరకు టీఆర్ఎస్కు కూడా పనిచేసింది. అయితే కేసీఆర్..ఐప్యాక్ టీంని పట్టించుకోలేదు. దీంతో టీం టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చింది. ఇదే క్రమంలో మునుగోడులో గెలుపు కోసం ఐప్యాక్ టీంతో రేవంత్ ఒప్పందం చేసుకున్నారట. ఐప్యాక్ టీంకు చెందిన 15 మంది మునుగోడులో కాంగ్రెస్ గెలుపు కోసం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నట్లు తెలిసింది. మరి రేవంత్ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.