Breaking : ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌… కేసీఆర్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

-

ఇంటర్మీడియట్ సిలబస్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న వార్షిక పరీక్షలతోపాటు సప్లిమెంటరీ పరీక్షలను వంద శాతం సిలబస్ తోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్టల్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. అంతేకాకుండా వంద శాతం సిల‌బ‌స్‌తో కూడిన ఇంట‌ర్ ప్ర‌శ్నాప‌త్రాల‌ను బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. కరోనా మహమ్మారి.. లాక్ డౌన్ పరిణామాల కారణంగా గత రెండేళ్లుగా 70 శాతం సిలబస్ తోనే బోధన.. పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. తగినన్ని రోజులు క్లాసులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విద్యార్థులపై భారం పడకుండా ప్రభుత్వం 70 శాతం సిలబస్ తోనే విద్యాబోధన.. పరీక్షలు జరిపించింది.

Telangana CM KCR mourns death of 11 workers in Secunderabad godown fire,  announces Rs 5 lakh ex gratia - India Today

అయితే ఈ విద్యా సంవత్సరం ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా ప్రారంభమై.. తరగతులు కరోనాకు ముందు స్థాయిలోనే జరుగుతున్న విషయం తెలిసిందే. జూన్ 15 నుండి కాలేజీలు ప్రారంభం అయ్యాయని.. త్వరలోనే విద్యార్థులకు 100 శాతం సిలబస్ బోధన పూర్తవువుతుందని ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వానికి తెలియజేశారు. దీంతో సిలబస్ పై విద్యాశాఖ ఉన్నతాధికారులు, నిపుణనులతో సమీక్షించిన ప్రభుత్వం వారి సూచనల మేరకు 100శాతం సిలబస్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఇంటర్ వార్షిక పరీక్షలను.. అలాగే సప్లిమెంటరీ పరీక్షలను వంద శాతం సిలబస్ తో పూర్తి స్థాయిలోనే పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news