కోమటిరెడ్డికి షర్మిల సపోర్ట్..మునుగోడు లెక్క ఇదే..!

-

మునుగోడు ఉపఎన్నిక పోరు హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే..ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులతో ప్రచారాన్ని హోరెత్తుస్తున్నాయి. ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా చూసుకోవడమే లక్ష్యంగా పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అలాగే అందివచ్చిన అవకాశాలని వదులుకోకుండా..ప్రత్యర్ధులకు చెక్ పెట్టే దిశగా పనిచేస్తున్నాయి. ఓటర్లకు ఊహించని విధంగా తాయిలాలు పంచుతున్నారు. గెలవడం కోసం ఇతర పార్టీల్లో ఉండే ఛోటా మోటా నేతల దగ్గర నుంచి బడా నేతల వరకు కొనేస్తున్నారు.

మొత్తానికి మునుగోడులో డబ్బు ప్రవాహం కనిపిస్తోంది. ప్రత్యర్ధులకు ఎత్తుకు పై ఎత్తు వేసి చెక్ పెట్టేలా వ్యూహాలు రచిస్తున్నారు. కలిసొచ్చే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే టీఆర్ఎస్..కమ్యూనిస్టుల మద్ధతు తీసుకుంది..అలాగే కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతలని లాగేస్తుంది. ఇక తమ పార్టీ నుంచి ఎవరైనా వేరే పార్టీలోకి వెళితే..వారిని కూడా మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది. ఇటు బీజేపీ సైతం..టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులని లాగుతుంది.

ఇక నేతలని కొనడానికి ఎంత ఖర్చు పెడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. అలాగే కులాల పరంగా ఓట్లు కొనుగోలు కార్యక్రమం నడుస్తోంది. ఇటు ఇండిపెండెంట్లని బరిలో లేకుండా చూసుకుంటున్నారు. వారికి డబ్బులు ఇచ్చి నామినేషన్ విత్‌డ్రా చేసుకునేలా చేస్తున్నారు. ఇలా ఏ అవకాశం వదలడం లేదు. ఇదే క్రమంలో మునుగోడులో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి..వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పరోక్షంగా మద్ధతు ఇస్తున్నారని తెలిసింది.

అసలు తెలంగాణలో షర్మిల పార్టీ ప్రభావం పెద్దగా లేదు..కాకపోతే ఖమ్మ, నల్గొండ జిల్లాల్లో కాస్త ప్రభావం ఉంటుందని సర్వేల్లో తేలింది. ఇప్పుడు నల్గొండలోని మునుగోడు ఉపఎన్నిక జరుగుతుంది..ఇక్కడ రెడ్డి, క్రిస్టియన్ కమ్యూనిటీ ఓట్లు బాగానే ఉన్నాయి. వైఎస్సార్ అభిమానులు ఉన్నారు. కొద్దో గొప్పో ఉన్న ఓట్లు కోమటిరెడ్డికి పడేలా షర్మిల పార్టీ ప్లాన్ చేసిందని తెలిసింది. అయితే మొదట నుంచి కోమటిరెడ్డి కుటుంబం..వైఎస్సార్‌కు కుటుంబానికి విధేయతతోనే ఉన్నారు. షర్మిల పట్ల అభిమానం కూడా ఉంది. ఆ మధ్య షర్మిల మునుగోడులో ఓ దీక్ష చేస్తే..రాజగోపాల్ ఫోన్ చేసి మరీ మద్ధతు ఇచ్చారు. ఇప్పుడు ఉపఎన్నికలో బరిలో నిలవకుండా షర్మిల..కోమటిరెడ్డికి సపోర్ట్ ఇస్తున్నారని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news