‘‘మా అమ్మ నన్ను కొట్టింది, నా చాక్లెట్లు దొంగిలించింది, ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి’’ అంటూ.. మూడేళ్ల బుడ్డోడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని బుధన్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. పిల్లాడు చేసిన పనికి ఫిదా అయిన మంత్రి దీపావళి కానుకగా బాలుడికి సైకిల్ ఇచ్చారు. ఆ బుడతడితో మంత్రి వీడియో కాల్ కూడా మాట్లాడారు.
మధ్యప్రదేశ్‌లోని బుధన్‌పూర్ జిల్లా డెడ్తలై గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు ఇటీవల తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమ్మ తనను చాక్లెట్లు తిననీయడం లేదని, తనను కొడుతోందని, ఆమెను జైలులో పెట్టండి అని అమాయకంగా ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ ప్రియాంక నాయక్ కూడా ఫిర్యాదు రాస్తున్నట్లుగా బాలుడిని నమ్మించారు. బాలుడికి నచ్చజెప్పి ఇంటికి పంపించారు. బాలుడి ఫిర్యాదుపై తామంతా నవ్వుకున్నట్లు వెల్లడించారు. కాగా, ఆ బుడతడు తన తల్లి గురించి అమాయకంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
बुरहानपुर: दीपावली से पहले मनी 'हमजा' की दिवाली…
हमजा साइकिल और चॉकलेट पाकर हुआ प्रफुल्लित…
हमजा के माता-पिता ने गृह मंत्री @drnarottammisra की सहृदयता, सहिष्णुता, सद्भावना और मासूम हमजा के प्रति स्नेह का हृदय से आभार व्यक्त किया है…@proburhanpur#JansamparkMP pic.twitter.com/ivJCQiPdtu
— Home Department, MP (@mohdept) October 18, 2022